అమెరికాలో అక్రమ నివాసం.. రూ.20వేల కోట్లు చెల్లిస్తున్న ఇండియన్స్

By telugu news teamFirst Published Mar 9, 2021, 12:05 PM IST
Highlights

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 2019 ఆర్థిక సంవత్సరంలో 2.8 బిలియన్ డాలర్లు(రూ. 20 వేల కోట్లకు పైగా) పన్నుల రూపంలో వెళ్లిన్నట్టు అమెరికన్ కమ్యూనిటీ సర్వే డేటా తాజాగా వెల్లడించింది. 

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని తాజా నివేదికలో వెల్లడయ్యింది. అక్రమంగా నివసిస్తున్న వలసదారుల జాబితాలో భారతీయులు మూడో స్థానంలో నిలిచారు. అమెరికా వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారు. 

మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్లో భారతీయులే ఉణ్నారు. వీరి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 2019 ఆర్థిక సంవత్సరంలో 2.8 బిలియన్ డాలర్లు(రూ. 20 వేల కోట్లకు పైగా) పన్నుల రూపంలో వెళ్లిన్నట్టు అమెరికన్ కమ్యూనిటీ సర్వే డేటా తాజాగా వెల్లడించింది. 

అంతేకాకుండా భారతీయులు 15.5 బిలియన్ డాలర్లు వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికాలో కోటి 30 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు ఉంటే.. అందులో 40.8 శాతం మంది మెక్సికో, భారత్‌కు చెందిన వారేనని డేటా తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మెక్సికో, భారతీయులు కలిపి 92 బిలియన్ డాలర్లు సంపాదించగా.. 9.8 బిలియన్ డాలర్ల పన్నులను ప్రభుత్వానికి చెల్లించారు.  

click me!