అమెరికాలో కాల్పుల కలకలం: హంతకుడు మిస్సింగ్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

Siva Kodati |  
Published : Jun 21, 2020, 07:07 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం: హంతకుడు మిస్సింగ్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

సారాంశం

అమెరికాలో చాలా రోజుల తర్వాత కాల్పుల కలకలం రేపాయి. మిన్నెయాపోలిస్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి పౌరులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి

అమెరికాలో చాలా రోజుల తర్వాత కాల్పుల కలకలం రేపాయి. మిన్నెయాపోలిస్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి పౌరులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి.

శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో 11 మంది గాయపడగా, ఒకరు మరణించినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. నిందితుడి ఆచూకీ తెలియరాలేదని, ఆ ప్రాంత ప్రజలెవ్వరూ బయట తిరగొద్దని పోలీసులు సూచించారు.

ఈ ఘటనను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టగా అందులో ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

అక్క‌డ ఏడాదిలో 185 రోజులు సెల‌వులే, ప‌రీక్ష‌లుండ‌వు.. ర్యాంకుల గోల అంత‌కంటే ఉండ‌దు
స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో