మెట్లపై నుంచి కారు.. లొకేషన్ సిస్టమ్ అదే రూట్ చూపించిందన్న మహిళా డ్రైవర్.. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్న పోలీసులు

Published : May 02, 2022, 02:57 PM IST
మెట్లపై నుంచి కారు.. లొకేషన్ సిస్టమ్ అదే రూట్ చూపించిందన్న మహిళా డ్రైవర్.. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్న పోలీసులు

సారాంశం

ఆ మహిళా డ్రైవర్ పోలీసు డిపార్ట్‌మెంట్ గ్యారేజీ గుండా వెళ్తూ మెట్లు కూడా కారులోనే దిగాలని ప్రయత్నించారు. రెండు మూడు మెట్లు దిగగానే కారు ఆగిపోయింది. తన జీపీఎస్ సిస్టమ్ ఇదే రూట్ చూపించిందని పోలీసులకు ఆమె చెప్పింది. కాగా, ఆమె మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.  

న్యూఢిల్లీ: మనకు తెలియని చిరునామాకు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌)ను వినియోగించడం చాలా మందికి అలవాటు. మరీ ముఖ్యంగా నగరంలోనైతే.. బైక్ అయినా.. కారు అయినా.. మరే వాహనమైనా.. తెలియని అడ్రస్ వెళ్లుతున్నామంటే జీపీఎస్ ఆన్ చేసుకుని దాని డైరెక్షన్స్ మేరకు ప్రయాణం చేస్తుంటాం. అయితే.. జీపీఎస్‌ అక్యూరసీ కొన్నిసార్లు చాలా తక్కువగా ఉండొచ్చు. అప్పుడే ఆ ప్రయాణికుడికి అసలు సమస్య ఎదురవుతుంది. అందుకే జీపీఎస్ వినియోగించి డ్రైవ్ చేసి అబాసుపాలైన వారి గాథలు కోకొల్లలు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి వార్తలు ట్రెండ్ అయిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ఓ మహిళ తన కారును ఏకంగా పోలీసు డిపార్ట్‌మెంట్ గ్యారేజ్ నుంచి వెళ్లుతూ జీపీఎస్ ఆన్ చేసుకున్నారని,  వీధిలోకి అది దారి చూపించింది. కానీ, ఆ దారి కారులో వెళ్లడానికి కాదు.. నడుచుకుంటూ వెళ్లడానికి సరిపోయే దారి. కానీ, ఆమె తన కారులోనే పోనిచ్చింది. వెళ్తుంటూ కింది ఫ్లోర్‌కు వెళ్లడానికి మెట్లు వచ్చాయి. ఆ మెట్లనూ కారులో ఉండే దిగాలనుకుంది. ఆ తర్వాత ప్రధాన వీధిలోకి చేరాలని భావించింది. రెండు మూడు మెట్లు దిగిందో లేదో.. కారు డ్యామేజీ అయింది.

ఈ ఘటనపై పోర్ట్‌లాండ్ పోలీసు డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటన విడుదల  చేసింది. పోలీసు డిపార్ట్‌మెంట్ గ్యారేజీ గుండా ఓ 26 ఏళ్ల మహిళా డ్రైవర్ ఎస్‌యూవీ కారు నడుపుకుంటూ వెళ్లారని, అందులో పాదచారులు నడిచే ప్లాజాను కూడా కారులోనే ఆమె క్రాస్ చేశారని వివరించింది. ఆ తర్వాత ఆమె మెట్లను కూడా కారులో ఉండే దిగాలనుకున్నారని, ఆ తర్వాత మిడిల్ స్ట్రీట్‌లోకి వెళ్లాలని భావించారని పేర్కొంది. కారు మెట్లపైనే అటకాయించిందని, దీంతో తాము ఆమెను అక్కడే పట్టుకుని ఆరా తీశామని వివరించింది. తన జీపీఎస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆధారంగా కారు నడపుకుంటూ వెళ్లానని ఆమె చెప్పినట్టు తెలిపింది. కానీ, ఆ పోలీసు అధికారులు మాత్రం ఆమె బ్లడ్‌లో ఆల్కహాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు భావించారని పేర్కొంది. దీంతో వెంటనే ఆమెకు ఓయూఐ సమన్లు పంపింది. ఆమె ఈ ప్రమాదంలో ఎవరినీ ఢీకొట్టలేదని, ఇది సానుకూల విషయం అని వివరించింది. కాకపోతే.. ఆ కారుకు కొంచెం నష్టం వాటిల్లిందని పేర్రకొంది. కాబట్టి, దయచేసి మద్యం సేవించి వాహనం నడపవద్దని పునరుద్ఘాటించింది.

అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను సీరియస్‌గా తీసుకుంటారు. ఆపరేటింగ్ అండర్ ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ అనే అర్థంలో వారు అలాంటి డ్రైవర్లకు ఓయూఐ సమన్లు పంపిస్తారు. అయితే, పోలీసులు ఆ బాధితురాలి వివరాలను వెల్లడి చేయలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే