
లండన్ : హ్యారీ మతాదీన్. బ్రిటిష్ కు చెందిన వ్యక్తి. తనకున్న డిప్రెషన్ సమస్యలనుంచి బయటపడడానికి తన మూత్రం తానే తాగానని.. గత ఆరేళ్లుగా తానిలా చేస్తున్నానని ప్రకటించాడు. అంతేకాదు మూత్రం తాగడం వల్ల యాంటి ఏజింగ్ ఎలిమెంట్ లా పనిచేసిందని, పదేళ్లు చిన్నవాడిగా అయ్యానని చెప్పి ఆశ్చర్యపరిచాడు.
న్యూయార్క్ పోస్ట్‌లో వచ్చిన ఓ రిపోర్ట్ ప్రకారం, 2016నుంచి అతను ఇలా తాగడం మొదలుపెట్టాడు. అతను మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఎన్నో చికిత్సలు తీసుకున్నాడు. ఆ తరువాత తన మూత్రాన్ని తానే తాగడం ప్రారంభించిన తర్వాత అతనికి మానసిక శాంతి, ప్రశాంతత కలిగాయని, నూతనోత్తేజం కలిగిందని చెప్పుకొచ్చాడు.
"నేను అది తాగేప్పుడు అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో నా ఊహకు అందలేదు. నేను మూత్రం తాగిన క్షణం నుండి, నా మెదడు మేల్కొంది. డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. అంతేకాదు నేను దీన్ని ఉచితంగా తయారు చేయగలుగుతాను. సంతోషంగా ఉంటాను”అని చెప్పాడు.
దీని వివరాల ప్రకారం...
హ్యారీ మాటాడీన్ రోజుకు దాదాపు 200 ml తన స్వంత మూత్రాన్ని తాగుతాడు. దీనికోసం నెలవారీ మూత్రాన్ని నిల్వ చేసుకుంటాడు. రోజువారీ తాగే ఈ మిశ్రమంలో నెలవారీ మూత్రంతో పాటు కొద్దిగా తాజా మూత్రం ఉంటుంది. మతాదీన్ ఇంకా ఏమంటాడంటే... అతని మూత్రం 'సూపర్ క్లీన్'... "తాజా మూత్రం తరచుగా తటస్థ వాసన కలిగి ఉంటుంది. శరీరంలో టాక్సిక్ అయితే తప్ప రుచి చెడుగా ఉండదు. నిల్వ ఉన్న మూత్రం ఎక్కువ దుర్వాసన ఉండదు’ అని వివరించాడు. మతాదీన్ తన మూత్రాన్ని తాగడమే కాకుండా, తన ముఖానికి మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగిస్తాడు.
“మూత్రం ముఖానికి రాసుకోవడం వల్ల నేను చాలా యవ్వనంగా కనిపిస్తాను. నిల్వ ఉన్న మూత్రాన్ని తాగడం వల్ల నా ముఖం మీద యవ్వనం తిరిగి సంతరించుకుంది. నేను దానిని నా ముఖంపై రుద్దినప్పుడు, తక్షణమే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. నా చర్మం యవ్వనంగా, మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. నేను ఇప్పటి వరకు చూసిన వాటిల్లో యాంటీ ఏజింగ్ కి బెస్ట్ సొల్యూషన్ మూత్రమే. మూత్రం రుద్దినప్పుడు చర్మం మృదువుగా మారుతుంది. యవ్వనంగా, సాగేతత్వం తగ్గుతుంది. నేను మూత్రం తప్ప మరే ఇతర చర్మ సంరక్షణను ఉపయోగించను”అని చెప్పాడు.
లోపం.. అయితే, మతాదీన్ మాత్రం తను మూత్రం తాగే అలవాటు ఒక్కసారిగా పడిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి అతని కుటుంబం అంగీకరించలేదు. అతని సోదరి కూడా అతనితో మాట్లాడటం మానేసింది.
హెచ్చరిక
మీ మూత్రాన్ని మీరే తాగడం లేదా.. మీ శరీరంపై రుద్దుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవనేది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటీష్ వైద్యుడు జెఫ్ ఫోస్టర్ ప్రకారం, ఎవరి మూత్రాన్ని వారే తాగడం వల్ల నిర్జలీకరణం జరుగుతుంది. అంతేకాదు శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది.