40 ఏళ్ల క్రితం అమెరికాను వణికించిన సీరియల్ కిల్లర్, రేపిస్ట్.. ఇప్పుడు కోర్టు ముందుకు..!!!

By Siva KodatiFirst Published Jun 30, 2020, 2:54 PM IST
Highlights

అమెరికాలో 1970, 1980 ప్రాంతాల్లో అనేక నేరాలు, ఘోరాలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ జోసెఫ్ జేమ్స్ డీయాంగె వ్యవహారం అప్పట్లో సంచలనం కలిగించింది

అమెరికాలో 1970, 1980 ప్రాంతాల్లో అనేక నేరాలు, ఘోరాలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ జోసెఫ్ జేమ్స్ డీయాంగె వ్యవహారం అప్పట్లో సంచలనం కలిగించింది. ఇతనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు అమెరికాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. 74 ఏళ్ల జోసెఫ్ ఆనాడు తన నేరాలతో శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా తదితర ప్రాంతాలను హడలెత్తించాడు. తాను 13 హత్యలు చేశానని, అత్యాచారాలకు, కిడ్నాప్‌లకు పాల్పడ్డానని కోర్టుకు తెలిపాడు.

ఈ కేసులకు సంబంధించి లాస్‌ ఏంజిల్స్ కోర్టు సోమవారం విచారించింది. అతను చేసిన కిరాతకాలకు గాను జోసెఫ్‌ను అప్పట్లో ప్రజలు ‘‘ గోల్డెన్ స్టేట్ కిల్లర్’’ అని పిలిచేవారట. సుమారు రెండు దశాబ్ధాల తర్వాత ఇతను చేసిన ఘోరాలకు లెక్కలేదని, పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పారిపోయేవారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

సాధారణంగా అయితే ఇన్ని నేరాలు చేసిన వాడికి ఖచ్చితంగా మరణశిక్ష పడాలి.. కానీ ఇతని వయసు రీత్యా జోసెఫ్‌కు మరణశిక్షపడదని, పెరోల్ లేకుండా యావజ్జీవ శిక్ష పడుతుందని కోర్టు వర్గాలు తెలిపాయి.

వియత్నాంకు చెందిన డీయాంగెలో.. తను చేసిన నేరాలకు ఇప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. 2018లో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో ఎప్పుడో విచారించవలసి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా జాప్యం జరిగిందని న్యాయస్థానం వర్గాలు వెల్లడించాయి.

జోసెఫ్ సుమారు 50 రేప్‌లకు పాల్పడ్డాడని, 1975 నుంచి ప్రారంభమైన ఇతని ఘాతుకాలు 1986 వరకు కొనసాగాయని ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ క్రమంలో 1986లో పద్దెనిమిదేళ్ల యువతిపై హత్యాచారం చేయడంతో జోసెఫ్ పట్టుబడ్డాడు. 


 

click me!