russia ukraine crisis: రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన.. ఏం చెబుతారో..?

Siva Kodati |  
Published : Feb 24, 2022, 09:28 PM IST
russia ukraine crisis: రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన.. ఏం చెబుతారో..?

సారాంశం

ఉక్రెయిన్ వ్యవహారంపై రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన చేయనున్నారు. ఉక్రెయిన్‌పై  అకారణంగా యుద్ధం చేస్తోందంటూ ఆయన ఇప్పటికే రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా చర్చించిన బైడెన్‌.. తమ సహాయ సహకారాలు కొనసాగుతాయంటూ హామీ ఇచ్చారు. 

ఉక్రెయిన్‌‌పై రష్యా యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో ప్రపంచం ఉలిక్కిపడింది. ఊహాకు అందని విధంగా పుతిన్ (putin) దాడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వ్యవహారంపై రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు (us president) జో బైడెన్‌ (joe biden) కీలక ప్రకటన చేయనున్నారు. ఉక్రెయిన్‌పై  అకారణంగా యుద్ధం చేస్తోందంటూ ఆయన ఇప్పటికే రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా చర్చించిన బైడెన్‌.. తమ సహాయ సహకారాలు కొనసాగుతాయంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అగ్రరాజ్యాధినేత ఎలాంటి ప్రకటన చేస్తారోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

అంతకుముందు ఈ ఉద్రిక్త‌త ప‌రిస్థితుల న‌డుమ NATO అత్య‌వ‌స‌రంగా సమావేశాన్ని నిర్వహించింది. రష్యా .. ఉక్రెయిన్‌లో ''మిలిటరీ ఆపరేషన్'' ప్రకటించిన తరువాత, ఇరు దేశాల పొరుగున ఉన్న మిత్రదేశాలలో దాని రక్షణను బలోపేతం చేయడానికి నాటో దేశాల రాయబారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండించారు NATO సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్. ఈ దాడిని "తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మే కాకుండా..  యూరో-అట్లాంటిక్ భద్రతకు భంగం క‌లిగించ‌డ‌మేని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రష్యా దూకుడు చర్యలకు ఆపాల‌ని హెచ్చ‌రించింది. ఈ యుద్దం త‌రువాత పర్యవసానాలకు ర‌ష్యానే బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు.
 
NATO అనేది 30 దేశాల కూటమి అనీ, ఈ కూట‌మీ ఉక్రెయిన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేయడం లేదనీ, అయితే, కొన్ని సభ్య దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో ఎటువంటి సైనిక చర్యను ప్రారంభించిదని  నివేదించింది. ఈ భయంకరమైన సమయంలో ఉక్రెయిన్ ప్రజలతో నిలబడతామనీ,  మిత్రదేశాలన్నీ రక్షించడానికి, నాటో చేయాల్సిందల్లా చేస్తుంద‌ని స్టోల్టెన్‌బర్గ్ అన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని అనాగరిక చ‌ర్య గా ప‌రిగ‌ణించారు. 

ఈ దాడితో యూరోపియన్ ఆర్థిక మార్కెట్‌లకు దాని బ్యాంకుల ప్రాప్యతను నిలిపివేస్తారని తెలిపారు. మ‌రో సారి ఈ రోజు సాయంత్రం ప్రారంభమయ్యే అత్యవసర శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్‌కు EU అభ్యర్థి హోదాను అందించడం గురించి కూడా చర్చిస్తారని లిథువేనియా అధ్యక్షుడు గిటానాస్ నౌసెడా తెలిపారు. అభ్య‌ర్థిత్వం కోసం చాలా రోజులుగా వేచిచూస్తున్న‌ప్ప‌టికీ.. నాయకులందరూ నుండి ఆమోదం పొందకపోవచ్చున‌ని అన్నారు. 

ఉక్రెయిన్ అధ్య‌క్షుడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నాము.  ఉక్రేనియన్ ను నాశనం చేయాలని పుతిన్ కోరుకుంటున్నారని, రష్యాపై సాధ్యమయ్యే అన్ని ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ  ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేశారు. "మేము మా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాము, మా దేశాన్ని రక్షించడానికి, మా చేతుల్లోని ఆయుధాలతో మన దేశాన్ని రక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము పోరాడుతాం.. అని  Zelenskiy అన్నారు,  ర‌ష్యా దాడిలో ఇప్ప‌టివ‌ర‌కూ 40 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించారని, మరియు వంద‌లాది మంది సైనికులు గాయపడ్డారని ఉక్రేయిన్ పేర్కోంది.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి