Russia Ukraine Crisis: ర‌ష్యాతో అన్ని దౌత్య సంబంధాలు క‌ట్‌.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

Published : Feb 24, 2022, 07:02 PM IST
Russia Ukraine Crisis: ర‌ష్యాతో అన్ని దౌత్య సంబంధాలు క‌ట్‌.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

సారాంశం

Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాల‌ని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. ఇదిలావుండగా, ఆ దేశంపై దాడి చేసిన అనంత‌రం ర‌ష్యాతో ఉక్రెయిన్ అన్ని దౌత్య సంబంధాల‌ను తెంచుకుంది.  

Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం విర‌మించుకోవాల‌ని ఇప్ప‌టికే ఐక్య‌రాజ్య స‌మితి ప‌లుమార్లు ర‌ష్యాకు విజ్ఞ‌ప్తి చేసింది. ఐరాస కౌన్సిల్ శాశ్వ‌త స‌భ్య దేశాలు సైతం ర‌ష్యా తీరుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. యూర‌ప్ దేశాలు సైతం ఉక్రెయిన్ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అమెరికా, దాని మిత్ర దేశాలు ఇప్ప‌టికే రష్యాపై వాణిజ్య ఆంక్ష‌లు విధించగా.. మ‌రిన్ని చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదిలావుండగా, ఆ దేశంపై దాడి చేసిన అనంత‌రం ర‌ష్యాతో ఉక్రెయిన్ అన్ని దౌత్య సంబంధాల‌ను తెంచుకుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ ర‌ష్యా భారీ దాడి చేసిన తర్వాత దానితో సంబంధాలను తెంచుకోవాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్ అధికారులు ఆ దేశ సైన్యం తిరిగి పోరాడుతోందని మరియు పాశ్చాత్య  దేశాల రక్షణ సహాయాన్ని కోరిందని చెప్పారు

ఇదిలావుండ‌గా, ర‌ష్యా తీసుకుంటున్న చ‌ర్య‌ల న‌డుమ NATO అత్య‌వ‌స‌రంగా సమావేశాన్ని నిర్వహించింది. రష్యా .. ఉక్రెయిన్‌లో ''మిలిటరీ ఆపరేషన్'' ప్రకటించిన తరువాత, ఇరు దేశాల పొరుగున ఉన్న మిత్రదేశాలలో దాని రక్షణను బలోపేతం చేయడానికి నాటో దేశాల రాయబారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంత‌రం ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండించారు NATO సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్. ఈ దాడిని "తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మే కాకుండా..  యూరో-అట్లాంటిక్ భద్రతకు భంగం క‌లిగించ‌డ‌మేని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రష్యా దూకుడు చర్యలకు ఆపాల‌ని హెచ్చ‌రించింది. ఈ యుద్దం త‌రువాత పర్యవసానాలకు ర‌ష్యానే బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న ఈ దాడి కార‌ణంగా ఆ దేశం భారీ మొత్తంలో ఆర్థిక‌, రాజ‌కీయ మూల్యం చెల్లించుకుంటుంద‌ని హెచ్చ‌రించింది నాటో. 

ఐక్య‌రాజ్య స‌మ‌తి (ఐరాస‌) సైతం ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి స్పందించిన UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర‌స్‌.. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం "నా పదవీకాలంలో అత్యంత బాధాకరమైన.. విషాద‌క‌ర‌మైన‌ క్షణం" అని పేర్కొన్నారు. అయితే భద్రతా మండలి సభ్యులు రష్యా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రేరేపిత‌.. అన్యాయ‌మైన చ‌ర్య‌కు రష్యా దిగుతున్న‌ద‌ని విమ‌ర్శిస్తున్నారు. అయితే, పౌరులను రక్షించే ఉద్దేశంతో తూర్పు ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించిన‌ట్టు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ప్ర‌క‌టించారు. ఇత‌ర దేశాల జోక్యం కూడా కుద‌ర‌ద‌ని హెచ్చ‌రించాడు. 

“ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా నా పదవీకాలంలో ఇది అత్యంత విషాదకరమైన క్షణం. భద్రతా మండలి సమావేశాన్ని ప్రెసిడెంట్ పుతిన్‌ను ఉద్దేశించి, నా హృదయం బాధ‌ప‌డుతోంది. తీవ్ర దుఃఖానికి గురిచేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి నుండి మీ దళాలను ఆపండి. చాలా మంది మరణించారు కాబట్టి శాంతికి అవకాశం ఇవ్వండి” అని గుటెర్రెస్ UN ప్రధాన కార్యాలయంలో విలేకరులతో అన్నారు. ప్ర‌స్తుత స‌మ‌యంలో మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించాల‌ని ర‌ష్యాను కోరారు. “నేను తప్పక చెప్పాలి.. అధ్యక్షుడు పుతిన్.. మానవత్వం పేరుతో మీ దళాలను రష్యాకు తిరిగి ర‌ప్పించ‌డంది. మానవత్వం పేరుతో, ఐరోపాలో శతాబ్ది ప్రారంభం నుండి అత్యంత ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించడానికి అనుమతించవద్దు. పరిణామాలు ఉక్రెయిన్‌కు మాత్రమే కాదు, రష్యన్ ఫెడరేషన్‌కు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి వినాశకరమైనవి”  అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి