
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ భద్రతలో భారీ లోపం ఉదంతం తెరపైకి వచ్చింది. డెలావేర్‌లోని జో బిడెన్ రెహోబోత్ బీచ్ హోమ్ సమీపంలో శనివారం ఒక చిన్న విమానం పొరపాటున నో-ఫ్లై జోన్‌లోకి ప్రవేశించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అమెరికా ప్రథమ పౌరుడు జో బిడెన్, ప్రథమ పౌరురాలు జిల్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వైట్ హౌస్, ఇంటెలిజెన్స్ సర్వీస్ ఈ సమాచారాన్ని మీడియాకు అందించాయి. అయితే ప్రెసిడెంట్, ఆయన కుటుంబానికి ఎలాంటి ముప్పులేదని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని వైట్‌హౌస్ తెలిపింది. ఒక విమానం వెకేషన్ హోమ్‌పై గగనతలాన్ని ఉల్లంఘించిందని ప్రకటన పేర్కొంది.
కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండగా ఉంటుంది - సీఎం ఉద్ధవ్ ఠాక్రే
మీడియా నివేదికల ప్రకారం.. అధ్యక్షుడు బిడెన్‌తో పాటు అతని కాన్వాయ్‌ను అతని ఇంటి నుండి అగ్నిమాపక కేంద్రానికి తీసుకెళ్లారు . ఇక్కడ అధ్యక్షుడు, ఆయన భార్యతో కూడిన SUV భవనం లోపలికి వెళ్లింది. సీక్రెట్ సర్వీస్ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం ప్రారంభించింది. ఈ సమయంలో రెహోబోత్ బీచ్ వద్ద 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని అంచనా వేసిన తరువాత, పరిస్థితులు అన్నీ అదుపులోనే ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత బిడెన్, అతడి భార్య జిల్ వారి రెహోబోత్ బీచ్ ఇంటికి తిరిగి పంపించారు. నిషేధిత గగనతలం నుంచి విమానాన్ని తక్షణమే బయటకు పంపినట్లు నిఘా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
మధ్యాహ్నం 12:45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం),ఒక చిన్న తెల్లటి విమానం బిడెన్ ఇంటి మీదుగా ఎగురుతున్నట్లు కనిపించింది. గగనతల నిషేదాన్ని ఉల్లంఘించి విమానం బయలుదేరింది. దీని తర్వాత రెండు యుద్ధ విమానాలు నగరం మీదుగా ఎగిరిపోయాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు ఎప్పుడూ నో ఫ్లై జోన్‌గా ఉంటుంది. US ప్రెసిడెంట్ ఎయిర్ సెక్యూరిటీకి US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహిస్తుంది.
ఈ ఘటనపై యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ (USSS) కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లియెల్మి మాట్లాడుతూ.. ‘‘ ఈరోజు తెల్లవారుజామున 1 గంటలకు ఒక ప్రైవేట్ విమానం ప్రమాదవశాత్తూ రెహోబోత్ డెలావేర్ నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. అయితే ఆ విమానాన్ని వెంటనే నిషేధిత గగనతలం నుండి బయటకు పంపించివేశారు ’’ అని తెలిపారు. ఆ విమానాన్ని నడిపిన పైలట్ ఆంథోనీ గుగ్లీల్మీని ఏజెన్సీలు విచారించాయి. అయితే ప్రాథమిక విచారణలో పైలెట్ సరైన రేడియో ఛానెల్‌ని ఉపయోగించడం లేదని తేలింది. అతడు ఫ్లైట్ గైడెన్స్ కోసం NOTAMS (నోటీస్ టు ఎయిర్‌మెన్) మార్గదర్శకాలను ఫాలో అయ్యాడని తెలుసుకున్నారు.
Agnipath : ‘అగ్నిపథ్’ స్కీమ్ ను ప్రధానికి వివరించిన సైనికాధికారులు.. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే ?
సాధారణంగా ఆమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ వెలుపల విహారయాత్రకు వెళ్లినప్పుడల్లా ఒక వారం ముందుగానే విమానాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిషేధాన్ని అమలు చేస్తుంది. ఈసారి కూడా అలాగే చేశారు. దీని ప్రకారం 10-మైళ్ల వ్యాసార్థం, 30-మైళ్ల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. దీంతో US ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్, నేవీ హెలికాప్టర్‌లు ఇతర హెలికాప్టర్‌లు ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే విమానాలను అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు. కాగా 2017 సంవత్సరం ఆగష్టులో కూడా ఇలాగే రష్యా వైమానిక దళానికి చెందిన జెట్ US కాపిటల్, పెంటగాన్, CIA ప్రధాన కార్యాలయం, జాయింట్ బేస్ ఆండ్రూస్ మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణించింది.