మాట నిలబెట్టుకున్న జో బైడెన్.. బహిరంగంగా కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్‌ కోర్స్‌..

By AN TeluguFirst Published Dec 22, 2020, 11:46 AM IST
Highlights

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగంగా కోవిడ్ టీకా తీసుకుని ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల మధ్యలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటాను అని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను బైడెన్‌ నిజం చేసి చూపారు. బైడెన్‌ సోమవారం క్రిస్టియానాకేర్‌ ఆస్పత్రిలో బహిరంగంగా ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారు. 

అలా జో బైడెన్‌ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా బహిరంగంగా వ్యాక్సిన్‌ తీసుకున్నాను’ అన్నారు. 

క్రిస్టియానాకేర్ ఆసుపత్రిలో నర్సు ప్రాక్టీషనర్, ఎంప్లాయీ హెల్త్ సర్వీసెస్ హెడ్ తబే మాసా బైడెన్‌కి వ్యాక్సిన్‌ వేశారు. అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్ భార్య డాక్టర్ జిల్ బిడెన్ ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి కోర్సును తీసుకున్నారు. బైడెన్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెళ్లగా అతనితో పాటు ఆమె కూడా హాజరయ్యారు. 

ఈ నేపథ్యంలో బైడెన్‌ "ఈ రోజు నేను కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఈ వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. ఇందులో భయపడాల్సిందేమీ లేదు. అమెరికా ప్రజలు నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. 
అందరికీ సరిపడా వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చిన రోజు.. మీరు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి" అని ట్విట్టర్‌ వేదికగా జనాలను కోరారు.

బైడెన్‌ చేసిన ఈ పనిని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ప్రశంసించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకున్నారు. ఇక వచ్చే వారం కమల బహిరంగంగా వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. 

click me!