కమలా హరీస్ పై నోరు పారేసుకున్న డోనాల్డ్ ట్రంప్

By Siva KodatiFirst Published Aug 12, 2020, 5:12 PM IST
Highlights

త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్ అయిన భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు.

త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్ అయిన భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు.

ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించిన కొద్దినిమిషాల తర్వాత, హారిస్‌ను ‘‘ఫోని’’గా ముద్ర వేస్తూ ఒక ప్రచార వీడియోను ట్రంప్ ట్వీట్ చేశారు. జో బిడెన్ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆమెను ఎన్నుకోవడం తనకు కొంచెం ఆశ్చర్యం కలిగించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా సెనేట్‌లో ఆమె అత్యంత నీచమైన, అత్యంత భయంకరమైన, ఏమాత్రం మర్యాదలేని వ్యక్తిగా తాను భావిస్తున్నానంటూ నోటి దురుసు ప్రదర్శించారు. అలాగే ‘‘ జాత్యహంకార విధానాలకు’’ బిడెన్ మద్ధతు ఇస్తున్నారంటూ విమర్శించారు.

అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా- అమెరికన్ మహిళగా, చరిత్రలో రెండో నల్లజాతి మహిళగా కమలా హారిస్ ఇప్పటికే రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా చరిత్రలో అధ్యక్ష టిక్కెట్లలో ఒకదానికి ఎంపికైన నాల్గవ మహిళగా కమల చరిత్ర సృష్టించారు.

1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా పార్టీల ఓటమి కారణంగా వారు విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించినట్లయితే ఉపాధ్యక్ష పదవి అలంకరించే తొలి మహిళగా కమలా హారిస్ నూతన అధ్యాయం లిఖించే అవకాశం వుంది. 

click me!