నోబెల్ శాంతి పురస్కారం: ట్రంప్‌ను నామినేట్ చేసిన నార్వే

By narsimha lodeFirst Published Sep 9, 2020, 9:46 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నార్వే ఎంపీ టిబ్రింగ్ జడ్జే నామినేట్ చేశారు.
 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నార్వే ఎంపీ టిబ్రింగ్ జడ్జే నామినేట్ చేశారు.

ప్రపంచంలో పలు వివాదాల పరిష్కరానికి ట్రంప్ చొరవ చూపారని ఎంపీ ప్రశంసించారు. మద్యంలో సైనిక దళాల తగ్గింపుతో పాటు శాంతి సాధనకు ట్రంప్ విశేషంగా కృషి చేశారన్నారు. యూఏఈ... ఇజ్రాయిల్ మధ్య సంబంధాలకు బలోపేతం చేయడంలో ట్రంప్ యంత్రాంగం కీలకపాత్ర పోషించిందని జడ్జే చెప్పారు.

ఇప్పటికే నలుగురు అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతులు అందుకొన్నారు. రూజ్ వెల్ట్, విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.మధ్య ప్రాచ్యంలో సైనిక దళాల తగ్గింపుతో శాంతి సాధనకు ట్రంప్ విశేషంగా కృషి చేశారన్నారు. నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరిస్తోందో అనే విషయాన్ని 2021 అక్టోబర్ తర్వాత ప్రకటించనున్నారు. 

అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నార్వే ఎంపీ నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడం చర్చకు దారితీస్తోంది. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

click me!