ఆక్స్ ఫర్డ్ కరోనా వాక్సిన్ ట్రయల్స్ కి బ్రేకులు

By team telugu  |  First Published Sep 9, 2020, 9:35 AM IST

కరోనా వాక్సిన్ పొందిన ఒక వాలంటీర్ కి ఊహించని ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని, అందుకోసమని తామే స్వచ్చంధంగా ట్రయల్స్ ని పాజ్ చేసినట్టుగా కంపెనీ తెలిపింది.


అతిత్వరలో అందుబాటులోకి వస్తుంది అని అందరూ భావిస్తున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వాక్సిన్ ట్రయల్స్ కి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తయారీ కోసం ఆక్స్ ఫోర్డ్ యూనివెర్సిటీతో ఒప్పందం కలిగి ఉన్న ఆస్ట్రాజెనెక కంపెనీ తాత్కాలికంగా ట్రయల్స్ ని పాజ్ చేస్తున్నట్టుగా పేర్కొంది. 

కరోనా వాక్సిన్ పొందిన ఒక వాలంటీర్ కి ఊహించని ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని, అందుకోసమని తామే స్వచ్చంధంగా ట్రయల్స్ ని పాజ్ చేసినట్టుగా కంపెనీ తెలిపింది. తమ స్టాండర్డ్ రివ్యూ పద్దతిలో భాగంగా ట్రయల్స్ ని పాజ్ చేశామని, స్వతంత్ర సంస్థ మరోసారి దీన్ని రివ్యూ చేసి పునఃసమీక్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

Latest Videos

undefined

కొత్త ట్రయల్స్ జరిగేటప్పుడు ఇలాంటివి సహజమేనని, ఎక్కడో ఎవరో ఒకరికి ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు... అందుకుగల కారణాలను స్వతంత్ర సంస్థ ద్వారా సమీక్షించినప్పుడుఈ మాత్రమే అందుకు అసలైన కారణం బయటకు తెలుస్తుందని, వాక్సిన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి విడుదల చేసేది లేదు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

పూర్తి ట్రయల్స్ మీద ప్రభావం పడకుండా చూసేందుకు, సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని సమీక్షిస్తామని తెలిపారు. అనారోజి సమస్య వచ్చిన వాలంటీర్ ఏ దేశస్థుడు అనే విషయం ఇంకా తమకు పూర్తి స్థాయిలో తెలియలేదని.... ఇలా ట్రయల్స్ సమయంలో జరగడం సహజమే అయినప్పటికీ.... కోవిడ్ వాక్సిన్ తయారీలో ఇలా జరగడం మాత్రం తొలిసారి అని సంస్థ అభిప్రాయపడింది. 

click me!