
అతను ఓ గౌరవ ప్రదమైన పదవిలో ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీసు.. భక్షకుడిగా మారాడు. చిన్నారులను లక్ష్యంగా చేసుకొని.. వారిపై లైంగిక దాడులకు పాల్పాడ్డాడు. చివరకు ఉన్నతాధికారులకు చిక్కాడు. ఈ సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలో ఒక పోలీసు అధికారి దారుణాలకు ఒడిగట్టాడు. చిన్న పిల్లలే టార్గెట్‌గా లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అతన్ని తాజాగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు అరెస్టు చేశారు. ఈ నిందితుడికి ఇక చిన్నారిని లైంగికంగా వేధిస్తున్న వీడియో ఎఫ్‌బీఐ చేతికి చిక్కింది. ఇది 2018 కన్నా ముందటిదని భావిస్తున్నారు. ఈ వీడియో నుంచి అతని మొహాన్ని క్యాప్చర్ చేసిన అధికారులు సోషల్ మీడియాలో ఆ ఫొటోలను విడుదల చేశారు.
ఫొటోలను నిందితుడి వివరాలు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ ఫొటో విడుదలైన మరుసటిరోజే అతన్ని ప్రజలు గుర్తించారు. నిందితుడు కూడా పోలీసు అధికారే అని తెలిసి అందరూ షాకయ్యారు. జోషువా క్రిస్టోఫర్ స్టాక్‌స్టిల్ అనే 29 ఏళ్ల పోలీసు అధికారి.. పికాయూనే పోలీస్ డిపార్టుమెంటులో సార్జెంట్‌గా ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు.
అతనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభంకాగానే.. పికాయూనే పోలీసు శాఖ జోషువాను ఉద్యోగంలో నుంచి తప్పించింది. దర్యాప్తులో ఎఫ్‌బీఐకి పూర్తిగా సహకరిస్తామని హామీ కూడా ఇచ్చింది.