
న్యూఢిల్లీ: విడాకులు అడిగిన భార్యపై ఆ భర్త శివాలెత్తాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవేశం పట్టలేక కత్తితో 30 సార్లు పొడిచేశాడు. ఈ ఘటన అమెరికాలోని లాస్‌వేగాస్‌లో చోటుచేసుకుంది.
లాస్ వేగాస్‌కు చెందిన క్లిఫర్డ్ జాకోబ్స్.. ఆయన భార్య 15 ఏళ్లుగా దంపతులు. బుధవారం 60 ఏళ్ల జాకోబ్స్‌కు ఆయన భార్యకు మధ్య వాగ్వాదం జరిగింది. అదే క్రమంలో ఆమె ఆయనను విడాకులు కావాలని అడిగింది. దీంతో ఆయన మరింత ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు. భౌతిక దాడే కాదు.. ఏకంగా కత్తితో పొడిచేశాడు. 30 సార్లు పొడిచి నెత్తుటి మడుగులో వదిలిపెట్టాడు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
తమ అపార్ట్‌మెంట్‌లో భార్యను జాకోబ్స్ పొడిచేశాడు. పోలీసులు అరెస్టు చేసి ఆయనను విచారించారు. ఈ విచారణలో తనకు అదంతా సరిగ్గా గుర్తు లేదని తెలిపారు. తనకు గుర్తు ఉన్నది కేవలం అపార్ట్‌మెంట్‌లో తన భార్య రక్తపు మడుగులో ఉండటం మాత్రమేనని పేర్కొన్నారు.
కాగా, నేను ఆమెను పొడిచేశాను.. నేను ఆమెను చంపేసినట్టు ఉన్నాను అని ఆయన అరిచాడని సమీపంగా ఉండే కొందరు చెప్పారు. ఆ అరుపులు తమకు వినపడ్డాయని పేర్కొన్నారు.
ఆ అపార్ట్‌మెంట్‌లో కిచెన్‌లో వినియోగించే కత్తులు, రక్తంతో తడిసిన కత్తెర్లు కనిపించాయని ఆ తర్వాత స్పాట్‌కు వెళ్లిన డిటెక్టివ్‌లు చెప్పారు.
ఆమె పరిస్థితి దారుణంగా ఉన్నది. పోలీసులు ఆమెను హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఎక్కువ సార్లు కత్తిపోట్లకు గురవ్వడంతో ఆమె చేతులను టార్నిక్వెట్స్‌తో కట్టాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
జాకోబ్స్ పై హత్యా ప్రయత్నం, ఇతర నేరాల కింద కేసు నమోదు అయింది.