చోక్సీకి షాక్: పౌరసత్వాన్ని రద్దు చేసిన అంటిగ్వా ప్రభుత్వం

By narsimha lodeFirst Published Jun 25, 2019, 12:39 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్న మెహల్ చోక్సీకి అంటిగ్వా ప్రభుత్వం పౌరసత్వాన్ని రద్దు చేసింది.
 

 అంటిగ్వా:   పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్న మెహల్ చోక్సీకి అంటిగ్వా ప్రభుత్వం పౌరసత్వాన్ని రద్దు చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోడీతో కలిసి చోక్సీపై కేసులు ఉన్నాయి. అంటిగ్వా ప్రభుత్వం చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు.

2018 జనవరి మాసంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే చోక్సీ దేశాన్ని దాటి వెళ్లాడు. చోక్సీని దేశానికి రప్పించేందుకు ఇండియా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక నేరస్తుడుగా ముద్రపడిన చోక్సీని ఇండియాకు తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నిస్తున్నాయి.

అయితే  ఈ కేసు విచారణను అంటిగ్వాలోనే చేపట్టాలని  చోక్సీ  కోరుతున్నారు. ఈ మేరకు ఆయన  ముంబై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.కానీ, విచారణను జాప్యం చేసేందుకు చోక్సీ ప్రయత్నిస్తున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

click me!