అమెరికా ఎన్నికలు 2020: ప్రీ పోల్ సర్వేలు, ట్రంప్ నకు జో బైడెన్ షాక్

By telugu teamFirst Published Nov 3, 2020, 1:03 PM IST
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ మీద జో బైడెన్ ది పైచేయిగా ఉందంటూ మీడియా సంస్థల ప్రీ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నట్లు ప్రీ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు మీడియా సంస్థలు అంచనా వేసినప్పటికీ విజయం ఖాయమని మాత్రం చెప్పలేకపోతున్నాయి. మరికొన్ని గంటల్లోనే కొద్ది గంటల్లో ప్రజలు తేల్చబోతున్నారు. 

భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల భవిష్యత్తుపై పలు సంస్థలు ప్రీ పోల్ సర్వేలు నిర్వహించాయి. అత్యదిక సర్వేలు బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు చెప్పాయి, కానీ ట్రంప్ ఓటమిని ఖాయమని మాత్రం తేల్చలేదు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 

పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఇరువురి మధ్య తేడా తగ్గినట్లు సర్వేలు అభిప్రాయపడ్డాయి. రియాల్ క్లియర్ పాలిటిక్స్ లెక్కల ప్రకారం... విజయాన్ని తేల్చేవిగా భావిస్తున్న రాష్ట్రాల్లో ట్రంప్ కన్నా బైడె్ కేవలం 2.9 పాయింట్ల ముందంజలో ఉన్నారు. అయితే, ఈ మాత్రం అధిక్యాన్ని మదింపు దోషం కింద తీసేస్తారు. అందువల్ల ట్రంప్ ఓడిపోతారని చెప్పలేదు. మొత్తం మీద పోరు మాత్రం హోరాహోరీ ఉంటుందని అర్థమవుతోంది. 

రియల్ క్లియర్ పాలిటిక్స్ అంచనాలను బట్టి ట్రంప్ కన్నా బైడెన్ 6.5 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ తేడా 9 పాయయింట్లు ఉండింది.దాంతో ట్రంప్ విజయం కష్టమేనని మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి. దాంతో ట్రంప్ ఓడిపోతారని తేల్చాయి. అయితే, ప్రీ పోల్ సర్వేలను ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. అవేవీ నిజాలు కావని అన్నారు.

వివిధ మీడియా సంస్థల ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి....

సీఎన్ఎన్/ ఎన్ఎన్ఆర్ఎస్ 
బైడెన్ 54 శాతం, ట్రంప్ 42 శాతం

ఎన్బీసీ/డబ్ల్యూఎన్ జే
బైడెన్ 52 శాతం, ట్రంప్ 42 శాతం

ఫాక్స్ న్యూస్
బైడెన్ 52 శాతం, ట్రంప్ 44 శాతం

ఐపిఎన్ఓఎన్/ రాయిటర్స్ 
బైడెన్ 52 శాతం, ట్రంప్ 42 శాతం

న్యూయార్క్ టైమ్స్/ సీయెన్నా
బైడెన్ 50 శాతం, ట్రంప్ 41 శాతం

click me!