
అంతరిక్షంలోని ఒక గ్రహశకలానికి నాసా సీన్ కానరీ పేరును పెట్టింది. జేమ్స్ బాండ్ పాత్రతో ప్రపంచఖ్యాతి గాంచిన ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన గౌరవార్థం ‘ది నేమ్ ఆఫ్ ద రోజ్’ చిత్రంలో ఆయన ప్రతిభకు గుర్తుగా ఒక ఆస్ట్రనాయిడ్‌కు సీన్ కానరీ పేరు పెట్టినట్లు నాసా తెలిపింది.
సీన్ కానరీ 1979లో మీటియర్ అనే సినిమాలో నటించారు. మీటియర్ అంటే ఉల్కపాతం అని అర్థం. గ్రహశకలం, భూమిని ఢీకొట్టకుండా నాసా ఎలా కాపాడింది అనే నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కానరీ ముఖ్యపాత్ర పోషించారు.
నాసా తన మొదటి ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి కంటే దశాబ్దాల ముందుగానే ఆయన ఈ పాత్రను పోషించారని నాసా సోమవారం తాను చేసిన ఒక ట్వీట్‌లో పేర్కొంది.
ఇదిలా వుండగా అంగారక, గురు గ్రహాల మధ్య ఇటీవల కనుగొన్న ఉల్కకు సీన్‌కానరీ పేరును పెట్టింది. ఆయన పేరులాగే ఇది ఎంతో కూల్‌గా ఉందని ఆ ఉల్క గురించి నాసా అభివర్ణించింది.
లెమ్మన్ శిఖరంపైనున్న 1.5 మీటర్ల సర్వే టెలిస్కోప్ ద్వారా ఆస్టరాయిడ్ 13070 సీన్ కానరీని ఈ ఏడాది ఏప్రిల్ 4న నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా నాసా ఇటీవల తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. జేమ్స్ బాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేర్కొందిన సీన్ కానరీ 90 ఏళ్ల వయసులో అక్టోబర్ 31వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే.