
న్యూఢిల్లీ: అమెరికా ఆర్మీలోని అన్ని శాఖలు ఇక పై మత పరమైన విషయాలు.. హిజాబ్, టర్బన్, ముస్లింలు ధరించే టోపీలు, యూదులు పెట్టుకునే యార్ముల్క్‌లు, గడ్డాలను అనుమతించాలని అమెరికా అధ్యక్ష కమిషన్ సిఫారసులు చేసింది. మే 12వ తేదీన ఈ ప్రతిపాదనలను యూఎస్ ప్రెసిడెన్షియల్ కమిషన్ అప్రూవ్ చేసింది. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయిన్లు, పసిఫిక్ ఐలాండర్లుపై శుక్రవారం ఈ మేరకు ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ రిపోర్టును విడుదల చేసింది.
మతపరమైన ఆచారాల్లో భాగంగా ఆయా మతాల వారు ధరించే టర్బన్స్, హిజాబ్, యార్ముల్క్‌లు సహా మతానికి సంబంధించి పెంచుకునే గడ్డాన్ని కూడా అనుమతించాలని తాజా సిఫారసులు పేర్కొన్నాయి. అయితే, వీటిపై 1981లో నిషేధం విధిస్తూ అమెరికా మిలిటరీ గైడ్‌లైన్స్ వచ్చాయి.
అయితే, అమెరికా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 2017, 2000 కాలంలో వెలువడ్డ ఉత్తర్వులు వీటిలో మార్పులు చేర్పులు తీసుకువచ్చింది. అమెరికా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీటిని 2017, 2000 కాలాల్లో చేసిన పాలసీలు అనుమతించాయి.
ప్రస్తుతం అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో వందలాది మంది సర్వీస్ మెంబర్లు తమ విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహించే వీటిని ధరించే సేవలు అందిస్తున్నారని కమిషన్ వివరించింది.
అయితే, యూఎస్ నేవీ, మెరైన్స్ మాత్రం మతపరమైన అంశాలపై పరిమిత స్థాయిలోనే అనుమతులు ఇచ్చాయి. తద్వార ఈ విభాగాల్లో పని చేసే వారు తమ మత ఆచారాలను ఉల్లంఘించాల్సి వచ్చేది. ప్రస్తుత సిఫారసులను వైట్ హౌజ్ డొమెస్టిక్ కౌన్సిల్ పరిశీలిస్తున్నది. సమీక్ష తర్వాత ఈ సిఫారుసులు అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు చేరుతాయి. ఆయన వీటిని అనుమతించాలా? లేదా? నిర్ణయం తీసుకుంటారు.