హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 24 రెట్లు శక్తివంతం.. కొత్త బాంబు తయారీకి సిద్దమైన అమెరికా..!!

By Sumanth Kanukula  |  First Published Oct 31, 2023, 11:14 AM IST

అగ్రదేశం అమెరికా మరో సంచలన ప్రకటన చేసింది. 1945 ఆగష్టులో జపాన్‌లోని హిరోషిమాపై జారవిడిచిన దాని కంటే 20 రెట్లు ఎక్కువ శక్తివంతమైన కొత్త అణుబాంబును అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని యూఎస్ మిలిటరీ ప్రకటించింది.


అగ్రదేశం అమెరికా మరో సంచలన ప్రకటన చేసింది. 1945 ఆగష్టులో జపాన్‌లోని హిరోషిమాపై జారవిడిచిన దాని కంటే 20 రెట్లు ఎక్కువ శక్తివంతమైన కొత్త అణుబాంబును అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని యూఎస్ మిలిటరీ ప్రకటించింది. యూఎస్ రక్షణ శాఖ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. ఈ కొత్త అణుబాంబను B61-13 అని పిలుస్తారు. ఇది B61-7 బాంబు 360 కిలోటన్నుల టీఎన్‌టీకి (మండే పదార్థాలతో కూడిన సమ్మేళనం) సమానమైన బ్లాస్ట్ దిగుబడిని కలిగి ఉంటుంది. ఈ మేరకు అమెరికా మీడియా కథనాలను ప్రచురించింది.

ఇక, హిరోషిమాపై వేయబడిన అణు బాంబు 15 కిలోటన్నుల టీఎన్‌టీ పేలుడు దిగుబడిని కలిగి ఉంది. అయితే ఇప్పుడు అమెరికా తయారుచేస్తున్నామని చెబుతున్న కొత్త బాంబును 24 రెట్లు ఎక్కువ శక్తివంతంతో కూడుకుంది. అయితే B61-13ను అభివృద్ది చేసేందుకు మొదట అమెరికా కాంగ్రెస్ ఆమోదించడంతో పాటు నిధులు సమకూర్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే 1945లో హిరోషిమా మీద జారవిడిచన రెండో ప్రపంచ యుద్దం ముగింపుకు దారితీసిన సంగతి తెలిసిందే. 

Latest Videos

‘‘ఈరోజు ప్రకటన మారుతున్న భద్రతా వాతావరణం, సంభావ్య శత్రువుల నుండి పెరుగుతున్న బెదిరింపులను ప్రతిబింబిస్తుంది’’ అని స్పేస్ పాలసీ కోసం రక్షణ శాఖ సహాయ కార్యదర్శి జాన్ ప్లంబ్ ఒక ప్రకటనలో తెలిపారు.

click me!