అమెరికాలో కొత్తరకం కరోనా... చిన్నారులే బాధితులు

By telugu news team  |  First Published May 13, 2020, 12:19 PM IST

కొంత మంది పిల్లల్లో ఈ రకమైన కరోనా సోకిన 6 వారాల తర్వాత వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్ ప్రజలను కోరారు.
 


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ప్రభావం మరీ ముఖ్యంగా అమెరికాలోనే ఎక్కువగా ఉంది. అక్కడ దాదాపు 14లక్షల మందికి  కరోనా వైరస్ సోకింది. కాగా దాదాపు 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ కేసుల్లోనూ, మరణాల్లోనూ అమెరికానే టాప్ గా ఉంది.

అయితే.. తాజాగా అమెరికాలో మరో వార్త తీవ్ర కలవర పెడుతోంది. అక్కడ కొత్త రకం కరోనా కేసులు నమోదౌతున్నాయి. పిడియాట్రిక్ మల్టీ-సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్.. అనే కొత్త రకమైన రోగంతో పెద్ద ఎత్తున కొత్త కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పిల్లల్లోనే కనిపించడం విశేషం. దీన్నే కవాసాకీ వ్యాధి లేదా టాక్సి షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తూంటారని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. 

Latest Videos

undefined

ఈ రకమైన వ్యాధి ఈ మధ్య న్యూయార్క్‌లోకి పిల్లలకు తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ రకమైన కరోనా సోకి.. పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే దాదాపు 100 మంది పిల్లలకు ఈ వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు మంది ఈ వ్యాధితో మృతి చెందారు. బుధవారం తొలిసారిగా ఐదేళ్ల పిల్లాడు న్యూయార్క్‌లో చనిపోయాడు. 

కాగా కొంత మంది పిల్లల్లో ఈ రకమైన కరోనా సోకిన 6 వారాల తర్వాత వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్ ప్రజలను కోరారు.

ఈ కొత్తరకం కరోనా లక్షణాలు ఇలా ఉన్నాయి..

జ్వరం, నీరసం, ఆకలి వేయకపోవడం, శరీరంపై దురద, పెదాలు ఎర్రగా మారడం, నోరంతా కూడా ఎర్రగా మారడం, కొంత మందిలో శరీర రంగు కూడా మారుతోంది. వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

click me!