కరోనాని జయించిన 113ఏళ్ల బామ్మ.. అంతకు ముందు మరో మహమ్మారిని కూడా..

By telugu news team  |  First Published May 13, 2020, 9:10 AM IST

ప్రస్తుతం తన ఆరోగ్యం ఎంతో బాగుందని..కొద్దిపాటి ఒళ్లు నొప్పులు మాత్రమే ఉన్నాయని ఆమె పేర్కొనడం గమనార్హం. మరియా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వారు కాగా.. స్పెయిన్ లో స్థిరపడ్డారు. 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ సోకి ఇప్పటిరకు రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ వైరస్ ని ఓ 113ఏళ్ల బామ్మ జయించింది. ఈ సంఘటన స్పెయిన్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్పెయిన్ కి  చెందిన మరియా బ్రన్యాస్(113) అనే బామ్మ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో అత్యంత అతి పెద్ద వయస్కురాలు ఈమే కావడం గమనార్హం.  మారియాకు ఏప్రిల్ లో కరోనా సోకింది. ఓల్డేజ్ కేర్ హోంలోని తన గదిలో ఐసోలేషన్  లో ఉంటూ ఆమె వైరస్ పై పోరాడారు.

Latest Videos

undefined

ప్రస్తుతం తన ఆరోగ్యం ఎంతో బాగుందని..కొద్దిపాటి ఒళ్లు నొప్పులు మాత్రమే ఉన్నాయని ఆమె పేర్కొనడం గమనార్హం. మరియా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వారు కాగా.. స్పెయిన్ లో స్థిరపడ్డారు. 

1918-19 లో విజృంభించిన స్పానిష్ ఫ్లూ నుంచి కూడా ఆమె గట్టెక్కడం గమనార్హం. రెండు ప్రపంచ యుద్ధాలు సహా 1936-39 మధ్య జరిగిన స్పానిష్ అంతర్యుద్ధాన్నీ కూడా ఆమె చూశారు.

click me!