చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్క రోజులోనే..

By telugu news teamFirst Published May 13, 2020, 10:24 AM IST
Highlights

కరోనా వైరస్ ఉద్భవించిన హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంలో మళ్లీ కరోనా వైరస్ ప్రబలడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వూహాన్ నగరంలో ఏప్రిల్ 23వతేదీన లాక్ డౌన్ ను ఎత్తివేయడంతో మళ్లీ కరోనా ప్రబలుతోంది. 


కరోనా మహమ్మారి చైనాలో మళ్లీ తిరగపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకేసింది. అయితే.. చైనాలో మాత్రం తగ్గుముఖం పట్టిందని అందరూ అనుకున్నారు. అయితే... అది మళ్లీ తిరగపెట్టడం గమనార్హం.

చైనాలోని వుహాన్ లో కరోనా కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. వూహాన్‌లోని సాన్‌మిన్‌ నివాస సముదాయంలో ఈ కొత్త కేసులు నమోదు కాగా.... అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్‌ చేసింది. మొన్న ఆరు కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా మరో 15 కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ ఉద్భవించిన హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంలో మళ్లీ కరోనా వైరస్ ప్రబలడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వూహాన్ నగరంలో ఏప్రిల్ 23వతేదీన లాక్ డౌన్ ను ఎత్తివేయడంతో మళ్లీ కరోనా ప్రబలుతోంది. 

దీంతో వూహాన్ నగరంలో పదిరోజుల పాటు 11 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు చేయాలని చైనా సర్కారు నిర్ణయించింది. వూహాన్ నగరంలో 3,869 మంది కరోనాతో మరణించారు. చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,926 కాగా వారిలో 4,633 మంది మరణించారు. మరో 104 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చైనా వైద్యాధికారులు చెప్పారు.

మరోవైపు, చైనాలోని అన్ని ప్రాంతాల్లోనూ వైరస్‌ ప్రభావం తగ్గిందనేందుకు సూచనగా ప్రభుత్వం కోవిడ్‌ రిస్క్‌ ప్రమాద హెచ్చరికను తగ్గించింది. వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ప్రఖ్యాత షాంఘై డిస్నీల్యాండ్‌ మళ్లీ మొదలైంది

click me!