విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో టైర్ ఊడిపోయింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన విమానానికి చెందిన టైర్ ఊడిపోవడంతో అత్యవసరంగా ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు పైలెట్.అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి జపాన్ కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మధ్య టైర్ ఊడిపోయింది. దీంతో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.జపాన్ కు వెళ్లేందుకు 249 మంది ప్రయాణీకుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేశారు.
also read:రాజ్యసభకు సుధా మూర్తి నామినేట్: శుభాకాంక్షలు తెలిపిన మోడీ
undefined
శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం టైర్ ఒకటి ఊడిపోయింది.ఈ టైర్ ఎయిర్ పోర్టులోని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారుపై పడి ఆ కారు ధ్వంసమైంది.
also read:40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు: దాడి ఇంటికి కొణతాల
ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్ లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
also read:భారత జాగృతి సమితి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం: జీవో నెంబర్ 3 ఏముంది?
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన విమానం టైర్ ఊడిపోయింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.