భారత మిలిటరీ బలగాలు మాల్దీవుల నుంచి మొత్తంగా వెళ్లిపోతాయని ఆ దేశ అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు తెలిపారు. సివిల్ డ్రెస్సులో కూడా భారత మిలిటరీ మాల్దీవుల్లో ఉండబోరని అన్నారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని వెళ్లగక్కారు. మాల్దీవుల్లో భారత మిలిటరీ ఉండటానికి వీల్లేదని అన్నారు. సివిల్ డ్రెస్‌లో ఉన్నా సరే భారత మిలిటరీని అంగీకరించబోమని చెప్పారు. మే 10వ తేదీ తర్వాత భారత పారామిలిటరీ బలగాలు, సివిల్ డ్రెస్‌లోనూ ఇక్కడ ఉండవని ముయిజ్జు ఈ రోజు అన్నారు.
మాల్దీవుల్లో ఉన్న మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒక దాని చార్జ్ తీసుకోవడానికి భారత సివిలియన్ టీమ్ బయల్దేరి వెళ్లింది. ఈ టీమ్ మాల్దీవులకు చేరుకున్న ఒక వారం వ్యవధిలోనే ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఉభయ దేశాలు మిలిటరీ ఉపసంహరణకు అంగీకరించిన డెడ్ లైన్ మార్చి 10. ఈ డెడ్ లైన్ ఇంకా రాకముందే ముయిజ్జు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
undefined
Also Read: వ్యర్థాల నుంచి బంగారం తీసిన శాస్త్రవేత్తలు.. ఒక్క రూపాయి పెట్టుబడికి రూ. 50 లాభం!
బా అటోల్ రెసిడెన్షియల్ కమ్యూనిటీతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత మిలిటరీని విజయవంతంగా వెనక్కి పంపడంలో తమ ప్రభుత్వం సఫలం అవుతున్నదని వివరించారు. కానీ, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించే వాదనలు చేస్తున్నాయని విమర్శించారు. భారత మిలిటరీ వెళ్లడం లేదని, సివిల్ డ్రెస్సుల్లో ఇక్కడే ఉంటున్నారని, కేవలం యూనిఫామ్స్ మార్చుకుంటున్నారని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మే 10 తర్వాత మాల్దీవుల్లో భారత మిలిటరీ బలగాలు ఉండవని స్పష్టం చేశారు. అది మిలిటరీ యూనిఫామ్‌లోనైనా, సివిల్ డ్రెస్సులోనైనా సరే.. భారత మిలిటరీ బలగాలు మాల్దీవుల్లో ఉండవని పేర్కొన్నారు.
చైనా నుంచి ఉచిత మిలిటరీ సహకారంపై ఒప్పందం కుదిరిన రోజే అధ్యక్షుడు ముయిజ్జు ఈ ప్రకటన చేయడం గమనార్హం.