కాశ్మీర్ పై పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి ఝలక్

By narsimha lodeFirst Published Aug 9, 2019, 6:42 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ పై పాక్ కు ఐక్యరాజ్యసమితి ఝలక్ ఇచ్చింది. మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా లేమని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

 న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ చేసిన విన్నపాన్ని ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఈ విషయం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశంగా ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.

జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ భారత్  నిర్ణయం తీసుకొంది.  అంతేకాదు ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కూడ విభజించింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మధ్యవర్తిత్వం వహించాలని ఐక్యరాజ్యసమితిని పాక్ కోరింది.

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్  కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు నిరాకరించినట్టుగా ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ప్రకటించారు.  కాశ్మీర్ వ్యవహరాన్ని పాక్ రాయబారి మలీహా లోధి గుటెరస్ దృష్టికి తీసుకొచ్చారు. కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు. కానీ, ఈ విషయంలో పాక్ కు ఐక్యరాజ్యసమితి తన వైఖరిని స్పష్టం చేసింది.

1972లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని గుటెరస్ గుర్తు చేశారు. ఈ అంశం రెండు దేశాల ద్వైపాక్షిక అంశంగా ఆయన అభిప్రాయపడినట్టుగా డుజారిక్ ప్రకటించారు. 

చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని ఆయన స్పష్టం చేశారు. మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని  ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో రెండు దేశాలు సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని భద్రతా మండలికి పాక్ విదేశాంగ మంత్రి పంపిన లేఖను భద్రతా మండలి సభ్యులకు కూడ పంపినట్టుగా ఆయన తెలిపారు. 

 


 

click me!