యుద్ధరంగంలో పెళ్లి బాజాలు... ఉక్రెయిన్ లో ఒక్కటైన మరో సైనిక జంట..

Published : Mar 07, 2022, 09:59 AM ISTUpdated : Mar 07, 2022, 10:00 AM IST
యుద్ధరంగంలో పెళ్లి బాజాలు... ఉక్రెయిన్ లో ఒక్కటైన మరో సైనిక జంట..

సారాంశం

ఓ వైపు యుద్ధ బీభత్సం మరోవైపు పెళ్లి బాజాలు.. ఉక్రెయిన్ లో ఇటీవల కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి దిగి 11రోజులు గడుస్తున్నాయి. అనేకమంది యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా పెళ్లి బాజాలు మోగడం ఆగడం లేదు.   

ఉక్రెయిన్ : ఇద్దరు Ukraine soldiers పెళ్లితో ఏకమవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆదివారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. Kyivpost సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రకారం, ప్రాదేశిక రక్షణ 112 బ్రిగేడ్‌కు చెందిన లెస్యా, వాలెరీ అనే ఇద్దరు సైనికలు ఆదివారం వివాహం చేసుకున్నారు.

ఈ నూతన వధూవరులకోసం అందరూ చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. వధువు తెల్లటి వేల్ (తల మీదినుంచి కిందికి వేల్లాడే ట్రాన్షపరెంట్ క్లాత్) కోసం హెల్మెట్‌ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది, ఆమె నవ్వుతూ.. వాలెరి చేతిని పట్టుకుంది. 

"ఈ రోజు, #UkraineRussiaWar ఫీల్డ్ లో, ప్రాదేశిక రక్షణ 112 బ్రిగేడ్‌లో, లెస్యా, వాలెరి వివాహం చేసుకున్నారు. మిలిటరీ చాప్లిన్ వారికి వివాహం చేశారు" అని కైవ్ పోస్ట్ ట్విటర్ లో వారి ఫొటోలు షేర్ చేసింది.  కొన్ని రోజుల క్రితం ఇదే సమయంలో, మరో జంట, క్లెవెట్స్,  నటాలియా వ్లాడిస్లేవ్ ఉక్రియాన్‌లోని ఒడెస్సాలో బాంబు షెల్టర్ లో వివాహం చేసుకున్నారు.

బాంబు షెల్టర్‌లో ఉన్న జంట చిత్రాలను బెలారస్ మీడియా హౌస్ పోస్ట్ చేసింది. వరుడు యూనిఫారం ధరించగా, వధువు పుష్పగుచ్ఛం పట్టుకుని ఉంది. మరోవైపు ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా విమానాశ్రయాన్ని రష్యా సైన్యం ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను విధించాలని విదేశాల నుండి వస్తున్న డిమాండ్‌ను అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. 

అంతకుముందు ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా వినిపిస్తున్న వైమానిక దాడి సైరన్లే పెళ్లి బాజాలుగా ఓ జంట చర్చిలో ఏకమయ్యింది. ఓ ఉక్రేనియన్ జంట కైవ్‌లోని ఒక చర్చ్ లో వివాహం చేసుకున్నారు. వారు ముందుగా ఈ పెళ్లి కోసం ఎంతో ప్లాన్ చేసుకున్నారు. పావురాలను ఎగరవేయడం, స్నేహితులు, బంధువులతో చర్చ్ లోకి వెళ్లడం.. వారికి పెద్దగా విందు ఇవ్వడం..లాంటివి.  కానీ అంతా తలకిందులయ్యింది.

వారికి చర్చిలోని పావురాల కూతలే పెళ్లి స్వాగతాలయ్యాయి. పెళ్లి తరువాత బయటికి వచ్చేప్పుడు యుద్ధసైరన్ల మోతాలు కొత్త జీవితానికి స్వాగతం పలికాయి. తమ దేశం యుద్ధంలో ఉందని వీరికి తెలుసు కానీ యారినా అరివా,  ఆమె భాగస్వామి స్వియాటోస్లావ్ ఫర్సిన్‌కి వేరే మార్గం లేదు. ‘పరిస్థితులు బాగాలేవని మాకు తెలుసు. మాతృభూమి కోసం పోరాడబోతున్నాం" అని అరివా అన్నారు, "బహుశా మేం చనిపోవచ్చు, అయితే.. అన్నింటికంటే ముందు మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం" అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

ఈ జంట మొదటిసారి అక్టోబర్ 2019లో కైవ్ మధ్యలో జరిగిన నిరసనలో కలుసుకున్నారు. ముందుగా వీరు మే 6న వివాహం చేసుకుని, రష్యాలోని వాల్డై హిల్స్‌లోని డ్నీపర్ నదికి ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌లో వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, పుతిన్ గురువారం తమ దేశంపై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించడంతో, ఈ జంట వెంటనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి