
కీవ్: Russia దళాల నుండి దేశాన్ని రక్షించడం కోసం పౌరులంతా ముందుకు రావాలని Ukraine అధ్యక్షుడు Zelenskiy పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆయుధాలను తాము ఇస్తామని అధ్యక్షుడు ప్రకటించారు.
రష్యా దాడి నుండి దేశాన్ని రక్షించుకొంటున్నామని ఆయన తెలిపారు. మేం దేశం కోసం పోరాటం చేస్తున్నామని జెలెన్ స్కీ చెప్పారు. గురువారం నాడు ఉదయం నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. రష్యన్లు యుద్ధానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి నిరసనలు తెలపాలని జెలెన్‌స్కీ కోరారు.
రష్యా మిలటరీ ఆపరేషన్ తో ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలోని మిమానాశ్రయాలను అర్ధరాత్రి 7 గంటల నుండి మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.
దీంతో ఉక్రయిన్ లో అత్యవసర పరిస్థతిని విధించారు. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసివేసింది. ఉక్రెయిన్ లో ఖార్కిస్, ఒడెస్సా, పోల్ లో మిస్సైల్స్ తో దాడులు చోటు చేసుకొన్నాయి. డోస్‌బాస్ లో ఉక్రెయిన్ బలగాలను వెనక్కి వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా ప్రకటించింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చైనా కోరింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో గురువారం నాడు దేశ ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. ఈ దాడితో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.
తూర్పు ఉక్రెయిన్ లో తిరుగుబాటు నాయకులు కైవ్ పై సైనిక సహాయం కోసం మాస్కోను కోరినట్టుగా క్రెమ్లిన్ ప్రకటించిన తర్వాత మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైందని పుతిన్ ప్రకటించారు. బుధవారం నాడు డోనెట్స్ , లుగాన్స్ వేర్పాటువాద నాయకులు పుతిన్ కు వేర్వేరుగా లేఖలు పంపారు. ఉక్రెయిన్ దూకుడును తిప్పికొట్టడానికి సహాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకొనే ఉద్దేశ్యం తమకు లేదని పుతిన్ తేల్చి చెప్పారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని ఆయన ప్రకటించారు.వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరుల రక్షణకు మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని పుతిన్ వివరించారు. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పుతిన్ తెలిపారు. తమ డిమాండ్ ను అమెరికా దాని మిత్ర దేశాలు విస్మరించాయని ఆయన తెలిపారు.