russia ukraine Crisis: నిన్నటి వరకు సేఫ్‌, కానీ .. వీడియో కాల్‌తో గోడు వెళ్లబోసుకున్న తెలుగు విద్యార్ధి

Siva Kodati |  
Published : Feb 24, 2022, 03:55 PM IST
russia ukraine Crisis: నిన్నటి వరకు సేఫ్‌, కానీ .. వీడియో కాల్‌తో గోడు వెళ్లబోసుకున్న తెలుగు విద్యార్ధి

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ (indian embassy) భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ (indian embassy) భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశాన్ని విడిచి వచ్చేందుకు పలువురు భావిస్తున్నా.. టికెట్లు దొరకడం లేదు, దొరికినా వాటిని కొనుగోలు చేసేంత స్తోమత వారి వద్ద వుండటం లేదు. అటు ఉక్రెయిన్‌‌లో చిక్కుకున్న భారతీయుల్లో 300 మంది తెలుగువారు కూడా వున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఓ తెలుగు విద్యార్ధి.. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు వీడియో కాల్ ద్వారా అక్కడి పరిస్ధితిని వివరించాడు. ‘‘ నిన్నటి వరకు పరిస్ధితి బాగానే వుందని అతను తెలిపాడు. ఉదయం విమానాశ్రయం వద్ద అటాక్ జరిగిన తర్వాతి నుంచి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయని.. టీవీల ద్వారా విషయం తెలుసుకుంటున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే ట్రావెల్ ఏజెంట్ల్ ద్వారా ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేస్తున్నారని పేర్కొన్నాడు. సేఫ్ అని చెప్పలేం.. కానీ హాస్టల్స్ నుంచి బయటకు రావొద్దని ఎంబసీ హెచ్చరించిందని అతను తెలిపాడు. మూడు  వైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టడంతో భారతీయ విద్యార్ధుల పరిస్ధితి అయోమయంగా మారింది. దీంతో రంగంలోకి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగారు. 

ఇండియాకు చెందిన సుమారు 20 వేల మంది ఉక్రెయిన్‌‌లో ఉంటున్నారు. రష్యా మిలటరీ చర్యను ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ తన గగనతలాన్ని ఇవాళ మూసివేసింది. దీంతో భారతీయుల కోసం వెళ్లిన ఎయిరిండియా విమానం .. ఢిల్లీ నుంచి వెనక్కి తిరిగొచ్చేసింది. అటుఇళ్ల నుండి బయటకు రావొద్దని Ukraine లో ఉన్న Indianలకు భారత ఎంబసీ సూచించింది. భారతీయ Students తాము ఉంటున్న హాస్టల్స్,  రెస్టారెంట్లు, ఇళ్ల నుండి బయటకు రావొద్దని కోరింది.  భారతీయులెవరూ కూడా కీవ్ పట్టణానికి వెళ్లవద్దని కూడా సూచించింది. కైవ్ లోని పశ్చిమ ప్రాంతాల నుండి ప్రయాణించే వారిని వారి నగరాలకు తిరిగి రావాలని కూడా కోరింది. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితి అత్యంత అనిశ్చితిగా ఉందని ఎంబసీ తెలిపింది. మీరు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలని కోరింది. 

ఇక గురువారం తెల్లవారుజామున పుతిన్ (putin) తన ప్రకటనలో రష్యా..  సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేస్తోందనీ, జనాభా ఉన్న ప్రాంతాలను కాద‌ని పేర్కొన్నారు. కానీ, అప్పటికే భారీ ప్రాణనష్టం జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దళం ఉత్తరాన ఉన్న తమ పోస్ట్‌లు రష్యన్ మరియు బెలారస్ దళాల నుండి దాడికి గురయ్యాయని పేర్కొంది. అంటే, ర‌ష్యా ఒక్క‌వైపు నుంచే కాకుండా అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్ పై దాడిని కొన‌సాగిస్తున్న‌ద‌ని ఈ ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. 

బెలారస్ వైపు నుంచి కొన‌సాగిన దాడికి సంబంధించిన వీడియో క్లిప్ లు వైర‌ల్ అవుతున్నాయి. కీవ్‌కు 120 మైళ్ల దూరంలో ఉన్న బెలారస్ సరిహద్దుపై కూడా రష్యా దాడి చేసిందని ఉక్రేనియన్ ప్రభుత్వ ప్రతినిధి ధృవీకరించారు. "ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు రష్యా మరియు బెలారస్ నుండి వచ్చిన దళాలచే దాడి చేయబడింది. ఉదయం 5 గంటలకు, ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు, రష్యన్ ఫెడరేషన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ ఉన్న ప్రాంతంలో, బెలారస్ మద్దతు ఉన్న రష్యన్ దళాలు దాడి చేశాయి" అని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి