వేలానికి మహిళల లోదుస్తులు.. అప్పుతీర్చలేదని అమానుషం..!

By AN TeluguFirst Published Feb 20, 2021, 11:06 AM IST
Highlights

బ్యాంకు రుణాలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయడమో, వేలం వేయడమో.. కేసులు పెట్టడమో చేస్తారు.. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం వింతగా, ఒకింత అమానుషంగా వ్యవహరిస్తోంది. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని తీర్చని మహిళల లోదుస్తులు వేలం వేస్తూ దారుణంగా ప్రవర్తిస్తోంది. 

అంతేకాదు సోషల్ మీడియాలో ఈ దుస్తుల ఫొటోలను  పెట్టి.. వీటిని అమ్ముతున్నామంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. కరోనా కాలంలో ఉక్రెయిన్ లో రుణాలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలా తీసుకున్నవారు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. 

ఈ నేపథ్యంలోనే బ్యాంకు రుణాలు తీసుకున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని ఆన్‌లైన్‌లో వేలానికి పెడుతోంది. సెటమ్ పేరుతో ఉన్న వెబ్ సైట్లో వాటిని వేలానికి ఉంచినట్లు ఒక వార్తా సంస్థ పేర్కొంది. ఈ వెబ్ సైట్ లో వివిధ రకాలు, రంగులతో ఉన్న వివిధ రకాలు, రంగులతో ఉన్న లోదుస్తుల ఫొటోలను ఉంచారు. 

వీటి ప్రారంభ ధర మన కరెన్సీలో రూ. 50లుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఉక్రెయిన ప్రభుత్వం 2015లోనే ‘సెటమ్’ అనే ఓపెన్ మార్కెట్ ను ఏర్పాటు చేసి, దాని ద్వారా రుణాలు చెల్లించని వారి వస్తువులను వేలానికి పెడుతోంది. కొద్దిరోజుల కిందట ఓ వృద్దురాలి పెంపుడు కుక్కను కూడా అధికారులు దీనిలో వేలానికి పెట్టారు. 

click me!