కరోనా టీకా కోసం.. ముసలివారిలా వేషం వేసి..

By telugu news teamFirst Published Feb 20, 2021, 9:27 AM IST
Highlights

ఈ వైరస్ కి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. ముందుగా వయసులో పెద్ద వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్  ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు వ్యాక్సిన్ కోసం ఏకంగా అధికారులనే బురిడీ కొట్టించారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కాగా.. ఈ వైరస్ కి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. ముందుగా వయసులో పెద్ద వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్  ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు వ్యాక్సిన్ కోసం ఏకంగా అధికారులనే బురిడీ కొట్టించారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

35, 45 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు తమకు 65పైబడినట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందుకు తగ్గట్లుగానే పెద్దవారిలా మారువేషం వేసుకొని కోవిడ్‌ టీకా సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ వారి పేర్లు, సంబంధిత రిజిస్ట్రేషన్‌ ఐడీతో సరిపోలడంతో అధికారులు వారికి వ్యాక్సిన్‌  మొదటి డోస్‌ను  వేసి ఇంటికి పంపించారు. అయితే వారి పుట్టినతేదీ వివరాలు మ్యాచ్‌ కావడం లేదని తర్వాత పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.

ఇద్దరు మహిళలు చేసిన టీకా మోసంతో అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ విషయంపై వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. అయితే వారు ఏ సెంటర్‌ నుంచి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ పొందారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 'మీకంటే అత్యంత ఎక్కువ అవసరం ఉన్న వారి వద్ద నుంచి మీరు వ్యాక్సిన్‌ను దొంగిలించారు' అని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని, అరెస్ట్‌ తప్పదని హెచ్చరించారు. అసలు ఆ మహిళలు ఎవరి నుంచి అపాయ్‌ంట్‌మెంట్‌ పొందారు? ఈ విషయంలో ఎవరైనా సహాయం చేశారా వంటి విషయాలపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. 
 

click me!