Trump-Zelensky: ట్రంప్ ఎవడిని కెలకకూడదో వాడిని కెలికేశాడు! ఇప్పుడు పరిస్థితి ఏంటంటే

Published : Mar 01, 2025, 10:48 AM ISTUpdated : Mar 01, 2025, 11:55 AM IST
Trump-Zelensky: ట్రంప్ ఎవడిని కెలకకూడదో వాడిని కెలికేశాడు! ఇప్పుడు పరిస్థితి ఏంటంటే

సారాంశం

వైట్ హౌస్‌లో ట్రంప్, వాన్స్ తో గొడవ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి చాలామంది ప్రపంచ నాయకుల మద్దతు లభించింది. యావత్ ప్రపంచం తమవైపే నిలబడుతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది పెద్ద షాక్. ఇంతకూ ఉక్రెయిన్ అధ్యక్షుడివైపే నిలిచిన దేశాలేవో తెలుసా? 

అగ్రరాజ్యం అమెరికా అంటే చాలాదేశాలు భయపడతాయి... రష్యా, చైనావంటి దేశాలు కూడా ఆదేశంతో పెట్టుకునేందుకు జంకుతాయి. అలాంటిది ఓ చిన్నదేశం ఉక్రెయిన్  అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించడంలేదు... ఆ దేశాధ్యక్షుడు  జెలెన్ స్కీ ఏకంగా డొనాల్డ్ ట్రంప్ నే ఎదిరించాడు. అమెరికా గడ్డపై అదీ అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కూర్చుని ట్రంప్ ను ఎదిరించిన జెలెన్ స్కీ గట్స్ కు వివిధ దేశాలు ఫిదా అవుతున్నాయి. దీంతో నేరుగా ట్రంప్ తో వాగ్వాదం గురించి ప్రస్తావించకున్నా తాము ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడతామని వివిధ దేశాలు ప్రకటిస్తున్నాయి.  

అమెరికా మద్దతు ఉక్రెయిన్ కు లేకపోయినా తాము మద్దతిస్తామని ఆస్ట్రియా, కెనడా ప్రకటించాయి. ఈ మేరకు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహామర్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  రష్యా దురాక్రమణను ఎదిరిస్తూ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న  ఉక్రెయిన్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఉక్రెయిన్ కే మా మద్దతు : ఆస్ట్రియా 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ తో  ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జలెన్ స్కీ వాగ్వాదంపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. అయితే ఆశ్చర్యంగా కొన్నిదేశాలు బహిరంగంగానే ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలా ఆస్ట్రియా కూడా ఉక్రెయిన్ కు అండగా నిలిచింది... ఆ దేశ వైస్ ఛాన్సలర్ కార్ల్ నెహమార్ ఇవాళ (శనివారం, మార్చి 1) ఆసక్తికర ట్వీట్ చేసారు.

"ఉక్రెయిన్ ప్రజలు గత 3 సంవత్సరాలుగా రష్యా దురాక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్నారు. నేను స్వయంగా యుద్ధ ప్రాంతాన్ని సందర్శించి... వాళ్ళు చేసిన త్యాగాలను చూశాను. ఈ యుద్ధం తొందరగా ముగియాలని మనమందరం కోరుకుంటున్నాం. రష్యా దురాక్రమణదారు కాబట్టి, శాంతి కోసం ఉక్రెయిన్ చేసే ప్రయత్నాలకు యూరప్ మద్దతు ఇస్తుంది'' అంటూ #westandwithukraine హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసారు. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షల్లెన్‌బర్గ్ కూడా #StandWithUkraine అని మద్దతు తెలిపారు. 

ఉక్రెయిన్ వైపే కెనడా కూడా 

ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు లేకున్నా తాము అండగా ఉంటామని కెనడా కూడా ప్రకటించింది. ట్రంప్, జెలన్ స్కీ వివాదం తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎక్స్ వేదికన ఓ ఆసక్తికర ట్వీట్ చేసారు. 

"రష్యా చట్టవిరుద్ధంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు. వాళ్ళ స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం చేసే పోరాటం మనందరికీ ముఖ్యం. శాంతి కోసం కెనడా ఉక్రెయిన్‌కు అండగా ఉంటుంది" అని కెనడా అధ్యక్షుడు ట్రూడో అభిప్రాయపడ్డారు. 

 

రొమేనియా, స్లోవేకియా కూడా ఉక్రెయిన్ వైపే :

రొమేనియా అధ్యక్షుడు ఇలీ బోలోజన్ మాట్లాడుతూ - యూరప్ భద్రతకు ఉక్రెయిన్ చాలా ముఖ్యం. మన విలువలు, స్వేచ్ఛ, శాంతి కోసం మనమందరం కలిసి పోరాడాలి అని అన్నారు.  

స్లోవేనియా అధ్యక్షులు నటాషా పిర్క్ ముసర్ కూడా ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి తాము మద్దతు ఇస్తామని ఎక్స్ ద్వారా స్పందించారు. "స్లోవేనియా అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది. ఓవల్ ఆఫీస్‌లో మనం చూసింది ఈ విలువలను, దౌత్యానికి పునాదిని దెబ్బతీస్తుంది" అని ఆమె అన్నారు.

"ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి మేము గట్టిగా మద్దతు ఇస్తాం. రష్యా దురాక్రమణదారు అని మళ్ళీ చెబుతున్నాం. మన చర్యలలో, ప్రపంచ వేదికపై మన సంబంధాలలో ప్రజాస్వామ్య ఆదర్శాలు కనిపించేలా వాటిని కాపాడుకోవాలి. ఉక్రెయిన్‌లో శాంతి కోసం యూరప్ నాయకత్వం తీసుకోవలసిన సమయం ఇది. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, న్యాయం, మర్యాదతో ఉండాలి" అని ఆమె అన్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !