Ukraine Russia Crisis: రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలకు బ్రేక్: అధినేతలతో ప్రతినిధుల సంభాషణ

Published : Feb 28, 2022, 07:49 PM ISTUpdated : Feb 28, 2022, 08:37 PM IST
Ukraine Russia Crisis: రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలకు బ్రేక్:  అధినేతలతో ప్రతినిధుల సంభాషణ

సారాంశం

ఉక్రెయిన్, రష్యా మధ్య సోమవారం నాడు జరిగిన చర్చలకు సంబంధించి బ్రేక్ ఇచ్చారు. చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు తమ దేశాధినేతలకు చర్చల సారాంశాన్ని చేరవేసేందుకు చర్చలకు బ్రేక్ ఇచ్చారు. 

కీవ్: Ukraine,  రష్యా మధ్య జరిగిన చర్చల మధ్య బ్రేక్ చోటు చేసుకొంది.   ఈ రెండు దేశాల మధ్య భారత కాలమాన ప్రకారం సోమవారం నాడు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో చర్చలు ప్రారంభమయ్యాయి. సుమారు నాలుగు గంటల పాటు రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే రెండు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని  ఆయా దేశాల అధ్యక్షులకు నివేదించేందుకు గాను రెండు దేశాల ప్రతినిధులు చర్చలకు కొంతసేపు విరామం ఇచ్చారని సమాచారం. ఆయా దేశాల అధినేతలకు చర్చల సారాంశాన్ని వివరించిన తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి చర్చలను కొనసాగించనున్నారు. తొలుత ఈ రెండు దేశాల మధ్య చర్చలు విఫలమైనట్టుగా ప్రచారం సాగింది. అయితే రెండు దేశాల అధినేతలతో చర్చల సారాంశాన్ని తెలిపేందుకు బ్రేక్ తీసుకొన్నారని ఆ తర్వాత మీడియాలో కథనాలు వచ్చాయి.

చర్చల్లో Russia నుండి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ తరపున ఆరుగురు ప్రతినిధులు హాజరయ్యారు.  కాల్పుల విరమణకు ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది.ఇవాళ మధ్యాహ్నం రష్యా ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో చర్చలు ప్రారంభమయ్యాయి.ఈ చర్చల్లో రెండు దేశాలు తమ వాదనలను విన్పిస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే డిమాండ్ ను రష్యా పెడుతుంది. అయితే కాల్పుల విరమణపై ఉక్రెయిన్ పట్టుబడుతుంది. ఎలాంటి తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది.  క్రిమియా నుండి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ పట్టుబడుతుంది. మరో వైపు నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసింది. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేటితో ఐదో రోజుకు చేరుకుంది. ఇరు దేశాలకు ఇది తీరని నష్టాన్నే మిగిల్చింది. ఈ తరుణంలో ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చలు జరగనుండటంతో అన్ని దేశాలు దీనిపై దృష్టి సారించాయి. ఈ చ‌ర్చ‌లు ఈ యుద్ధానికి ముగింపు ప‌లుకుతాయా?  లేకుంటే మ‌రింత ఉద్రిక్త‌ల‌కు దారి తీస్తాయా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

ఇక, ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చలకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు Zelensky కీలక వ్యాఖ్యలు చేశారు. తామంతా పోరాట యోధులం అని అన్నారు. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. రష్యా సైనికులు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే తమ దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించారు. రష్యా వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు సైనిక అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తామని చెప్పారు. తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 4,500 మంది రష్యన్ సైనికులు మరణించారని జెలెన్ స్కీ చెప్పారు.

ఇక, ఐదు రోజులలో ఇప్పటివరకు రష్యా దాడిలో 14 మంది పిల్లలతో సహా 352 మంది పౌరులు మరణించారని ఉక్రేనియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 116 మంది పిల్లలతో సహా 1,684 మంది గాయపడ్డారని తెలిపింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి గత ఐదు రోజుల్లో వ్లాదిమిర్ పుతిన్ బలగాలకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ  తెలిపింది. ఎంత మంది చ‌నిపోయార‌నే సంఖ్య‌ను ప్ర‌స్తావించ‌లేదు. యుద్ధంలో 5,300 మంది రష్యన్ ఆర్మీ సిబ్బంది మరణించారని ఉక్రెయిన్  పేర్కొంది. ఇదిలావుండ‌గా, ర‌ష్యా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున్న ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ వైపు వ‌స్తున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. Kvivకు ఉత్తరాన 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో భారీ గా బ‌ల‌గాలు ఉన్నాయ‌ని చెబుతున్నాయి. దీనికి తోడు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్.. న్యూక్లియ‌ర్ వెప‌న్స్ బ‌ల‌గాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంపై మ‌రింత ఉద్రిక్త ప‌రిస్థితికి దారి తీసింది. ప్ర‌పంచ దేశాలు సైతం పుతిన్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే