Russia Ukraine Crisis: ఇక‌పై నాటోలో చేరాల‌ని అనుకోవ‌డంలేదు.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

Published : Mar 09, 2022, 03:14 AM IST
Russia Ukraine Crisis:  ఇక‌పై నాటోలో చేరాల‌ని అనుకోవ‌డంలేదు.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

సారాంశం

Russia Ukraine Crisis: ఇకపై తాము నాటో కూటమిలో చేరాలనుకోవడంలేదని, ఇప్ప‌టి దేశం స్వ‌ర నాశ‌మూ చేసింద‌ని  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులకు తెగబడుతున్న రష్యాపై ఆ కూటమి పోరాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూభాగంలోని ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపై కూడా రాజీపడనున్నట్టు ప్రకటించారు.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా 13 రోజులుగా దాడి చేస్తునే ఉంది.  యుద్దాన్ని నిలిపివేయాల‌ని ప్ర‌పంచ దేశాలు ర‌ష్యాను కోరినా.. ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. రోజురోజుకు ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేస్తుంది త‌ప్పా.. ప్ర‌పంచ‌దేశాల‌ ఆంక్షల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రోవైపు.. పలు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. నివాస గృహాల‌ను టార్గెట్ చేస్తూ.. భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ త‌రుణంలో ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మంగళవారం స్పందించారు. 

ఈ అంశంపై జెలెన్స్కీ మాట్లాడుతూ.. NATOలో  త‌మ దేశం చేర‌డాన్ని ఇత‌ర దేశాలు  ఇష్టపడటం లేద‌నీ, దీంతో నాటో కూటమిలో తాము చేరాలనుకోవడంలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులకు తెగబడుతున్న రష్యాపై ఆ కూటమి పోరాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర‌ష్యాను ఎదురించ‌డానికి అనేక దేశాలు  భ‌య‌ప‌డుతున్నాయ‌ని అన్నారు. తమ భూభాగంలోని ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపై కూడా రాజీపడనున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడానికి ప్రధాన కారణాలు ఇవే కావడం గమనార్హం.   

 ఉక్రెయిన్ పై ర‌ష్య దాడిలో  దాదాపు నాలుగు వంద‌ల‌కు పైగా..  పౌరులు మృతి చెందారని  అంచనా వేసింది. ఆదివారం అర్ధరాత్రి నాటికి మరో 801 మంది గాయపడిన పౌరులు ధృవీకరించబడ్డారని పేర్కొంది. ఈ క్ర‌మంలో జెలెస్కీ.. తను ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రత్యక్ష చర్చలు కోరుకుంటున్నారు
రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడవ రౌండ్ శాంతి చర్చలు మార్చి 7 న జరిగాయి. ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాలేదు. కానీ ఇరుదేశాలు మానవతా కారిడార్‌లను తెరవడంపై దృష్టి సారించాయి.  

NATO సభ్యత్వాన్ని జెలెన్స్కీ ప్రస్తావిస్తూ, "మోకాళ్లపై నిల్చుంటే.. ఇచ్చేది ఎదైనా త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని తేల్చి చేప్పాడు.  నాటో సభ్యత్వం కోసం తాను ఇకపై ఇత‌ర స‌భ్య‌ ఒత్తిడి చేయడం లేదని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ చెప్పారు, నాటో స‌భ్య‌త్వం కోసం.. ఉక్రెయిన్   పొరగు దేశాల‌తో ప‌రిచయాలు ఏర్పచుకుంది.. రష్యా దాడి చేయడానికి  పేర్కొన్న కారణాల్లో ఒకటైన సున్నితమైన సమస్య.

మరోవైపు, యుద్ధం నేపథ్యంలో తాను పోలండ్‌కు పారిపోయానన్న వార్తలనూ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. తాను కీవ్‌లోని తన అధికారిక కార్యాలయంలోనే ఉన్న‌నీ.. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో లొకేషన్‌ షేర్‌ చేశారు. రష్యా దండయాత్ర.. ఉక్రెయిన్‌తో ముగియబోదని, ప్రపంచంలో ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తినేకొద్దీ ఆ మృగం ఇంకా కావాలంటూ మిగిలిన దేశాలపైనా దాడికి దిగుతుందని పుతిన్‌ను ఉద్దేశిస్తూ నిప్పులు చెరిగారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే