Apple Event 2022: యాపిల్ ఈవెంట్‌.. iPhone SE 3తో పాటు మ‌రిన్ని ప్రొడ‌క్ట్స్ లాంచ్ చేసిన యాపిల్

Published : Mar 09, 2022, 12:44 AM IST
Apple Event 2022: యాపిల్ ఈవెంట్‌.. iPhone SE 3తో పాటు మ‌రిన్ని ప్రొడ‌క్ట్స్ లాంచ్ చేసిన యాపిల్

సారాంశం

Apple Event 2022: యాపిల్ ఈవెంట్ (Apple Event 2022 ) నేడు మంగ‌ళ‌వారం జ‌రుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు యాపిల్ ఈవెంట్ 2022 లైవ్ ప్రారంభమైంది.  ఈవెంట్‌లో ఐఫోన్ ఎస్ఈ3, న్యూ ఐపాడ్ ఎయిర్‌తో పాటు మ్యాక్‌బుక్ లాప్‌టాప్స్‌, మాక్ మినీ, మాక్ స్టూడియో, ఎం2 సిలికాన్ చిప్‌, మాక్ బుక్ ఎయిర్‌, మాక్ బుక్ ప్రో మోడ‌ల్స్‌ను లాంచ్ చేసే అవ‌కాశం ఉంది.  

Apple Event 2022:  ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ ఈవెంట్ (Apple Event 2022 ) నేడు (మంగ‌ళ‌వారం) జ‌రుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు యాపిల్ ఈవెంట్ 2022 లైవ్ ప్రారంభమైంది.  ఈ ఈవెంట్లో  కొత్త ప్రొడక్టులను Apple ప్రకటించింది. ఈ ఈవెంట్ లో  iPhone SE 3 అప్‌డేట్, న్యూ ఐపాడ్ ఎయిర్‌ iPad Air 5,  తో పాటు మ్యాక్‌బుక్ లాప్‌టాప్స్‌, మాక్ మినీ, మాక్ స్టూడియో( Mac Studio), ఎం2 సిలికాన్ చిప్‌, మాక్ బుక్ ఎయిర్‌, మాక్ బుక్ ప్రో మోడ‌ల్స్‌ను లాంచ్ చేయ‌డం ప్రధాన అజెండాగా ప్ర‌క‌టించింది.  అలాగే..  iOS 15.4 వంటి అప్‌డేట్‌లు,  iPhone 13 లైనప్ లో మార్పుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.  

లాంచ్ చేసిన Apple ప్రొడ‌క్ట్స్ ఇవే..!.. 

iPhone SE 3, Mac Studio, iPad Air 5  

iPhone SE 3: iPhone SE 3 (2022) iPhone 13 మోడ‌ల్ ను చాలా అప్ డేట్ వ‌ర్ష‌న్ గా తీసుకవ‌చ్చింది.  A15 బయోనిక్ పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తో ఈ మొబైల్ ను తీసుక‌వ‌చ్చింది. ఇందులో 5G కనెక్టివిటీని జోడిచింది. దీని ధర $429 గా ప్ర‌క‌టించింది. 

ఐప్యాడ్ ఎయిర్ 5:   ఈ మొబైల్ లో 5G కనెక్టివిటీతో పాటు మెరుగైన పనితీరు కోసం Apple మ్యాజిక్ కీబోర్డ్‌కు M1 చిప్‌ను జోడించింది.  

Mac mini: ఈ ఈవెంట్ కోసం Apple తన కొత్త M2 Apple సిలికాన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఈ కొత్త వెర్షన్ M1 Pro లేదా M1 Max చిప్‌సెట్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది.  
 
యాపిల్ ఈవెంట్స్ (https://www.apple.com/in/apple-events/) వెబ్‌సైట్‌లో యూజర్లు లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. అలాగే యాపిల్ టీవీ యాప్‌, యాపిల్ అధికారిక యూట్యూబ్ చానెల్‌లోనూ ఈవెంట్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇప్పటికే యాపిల్ ప్రొడక్టులు వాడుతున్న వారికి ఆ సంస్థ రిమైండర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే