russia ukraine crisis: మనసు మార్చుకున్న జెలెన్ స్కీ... రష్యాతో చర్చలకు అంగీకారం

Siva Kodati |  
Published : Feb 27, 2022, 06:46 PM ISTUpdated : Feb 27, 2022, 06:59 PM IST
russia ukraine crisis: మనసు మార్చుకున్న జెలెన్ స్కీ... రష్యాతో చర్చలకు అంగీకారం

సారాంశం

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించింది. బెలారస్‌లో చర్చలకు అంగీకరించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్  స్కీ. ఈ నేపథ్యంలో చర్చల కోసం బెలారస్ బయల్దేరింది ఉక్రెయిన్ బృందం. 

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించింది. బెలారస్‌లో చర్చలకు అంగీకరించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్  స్కీ. ఈ నేపథ్యంలో చర్చల కోసం బెలారస్ బయల్దేరింది ఉక్రెయిన్ బృందం. అంతకుముందు రష్యాతో చర్చలు జరపడానికి తమ దేశం సిద్దంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) చెప్పారు. అయితే పొరుగున ఉన్న బెలారస్‌‌ మాత్రం చర్చలు జరపబోమని తెలిపారు. బెలారస్‌ను దండయాత్రకు వేదికగా జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు జెలెన్ స్కీ పలు ప్రాంతాలను సూచించారు. వార్సా, బ్రాటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకు‌లను చర్చలకు వేదికగా ప్రతిపాదించినట్టుగా చెప్పారు. 

‘మేము మాట్లాడాలనుకుంటున్నాము.. మేము యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం’ అని జెలెన్ స్కీ ఒక వీడియోలో చెప్పారు. అయితే క్షిపణులను ఉంచిన దేశంలో మాత్రం చర్చలు జరపలేమని తెలిపారు. ఇక, శాంతి చర్చల కోసం తమ నాయకులు బెలారస్ చేరుకున్నారని క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) నుంచి ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. తాము కూడా శాంతి చర్చలకు సిద్దమని Zelensky చెప్పారు.

మరోవైపు రష్యా నాలుగో రోజు ఉక్రెయిన్‌పై యుద్దాన్ని కొనసాగిస్తుంది. పలు నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు దూసుకెళుతుంది. పలునగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. రాజధాని కీవ్ నగరంపై మిస్సైల్‌ దాడులకు పాల్పడింది. ఆదివారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో రష్యన్ దళాలు ప్రవేశించాయి. రాత్రిపూట రష్యా బలగాలు జరిపిన దాడులలో ఖార్కివ్ వెలుపల గ్యాస్ పైప్ లైన్‌ను రష్యన్ దళాలు తగలపెట్టాయి. మరోవైపు కీవ్ సమీపంలోని వాసిల్కివ్‌లోని చమురు డిపో రష్యా క్షిపణి దాడితో ధ్వంసమైంది.

ఇక, కీవ్ నగరాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు ఉక్రెయిన్ బలగాలు తీవ్ర ప్రతిఘటనను కొనసాగిస్తున్నాయి. Kviv నగరం పూర్తిగా తమ Army ఆధీనంలోనే ఉందని  Ukraine ఆదివారం నాడు ప్రకటించింది. శనివారం నాడు విధ్వంసం తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపింది. ఇక, కీవ్ ను విడిచివెళ్లేందుకు అధ్యక్షుడు Zelensky నిరాకరించారు. కీవ్ ను రక్షించుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలని జెలెన్‌స్కీ కోరారు. అంతేకాకుండా కీవ్ నగరంలోని వీధుల్లో తిరిగిన ఫొటోలను షేర్ చేస్తూ ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన న్యాయ విభాగం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (International Court of Justice) ఆశ్రయించింది. నెదర్లాండ్స్‌లో ఐసీజే‌లో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తన దరఖాస్తును సమర్పించింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా తన చర్యలకు బాధ్యత వహించాలని పేర్కొంది.సైనిక కార్యకలాపాలు నిలిపివేయాలని రష్యాను ఆదేశించేలా అత్యవసర నిర్ణయాన్ని తీసుకోవాలని అభ్యర్థించింది. 

‘రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తన దరఖాస్తును ICJకి సమర్పించింది. దురాక్రమణను సమర్థించేందుకు మారణహోమం భావనను తారుమారు చేసినందుకు రష్యా బాధ్యత వహించాలి. సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని రష్యాను ఆదేశించే అత్యవసర నిర్ణయాన్ని మేము అభ్యర్థిస్తున్నాం. వచ్చే వారం ట్రయల్స్ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాము’ అని జెలెన్ స్కీ తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే