
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. అయితే, ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఇప్పటికే వేల మందిని భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. అయితే, ఇంకా సుమీలో చిక్కుకున్న వందలాది మంది భారతీయులు.. తినడానికి తిండి.. తాగడానికి నీరు లేకుండా.. కరెంట్ లేని పరిస్థితుల్లోనే అక్కడి బంకర్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన పలు దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఆగ్నేయ ఉక్రేనియన్ మారియుపోల్ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, ముఖ్యంగా సుమీలో ఇప్పటికీ వందలాది మంది భారత పౌరులు చిక్కుకుపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అక్కడి నుంచి వారు తప్పించుకోలేకపోతున్నారని వెల్లడిస్తున్నాయి. పౌరుల రక్షణ దృష్ట్యా రష్యా-ఉక్రెయిన్‌లు సంఘర్షణ ప్రాంతం నుంచి పౌరుల రక్షించడం కోసం మానవతా కారిడార్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. అయితే, రెండు దేశాల మధ్య ఇదివరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు పౌరులను తరలించడానికి కాల్పులను కొంత సమయం విరమించుకుంటున్నామని చెబుతూనే.. రష్యా దాడులకు జరుపుతుండటంతో సాధారణ పౌరులు అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే సుమీలో దాదాపు 700 మంది భారతీయులు చిక్కుకుపోయారని నివేదికలు పేర్కొంటున్నాయి.
అలాగే, ఉక్రెయిన్‌లోని కీలకనగరం.. పోర్ట్ సిటీ అయిన మారియుపోల్ ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని నగర మేరయ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి నుంచి సాధారణ పౌరుల తరలించడానికి మానవతా కారిడార్ తెరవాలని ఆయన కోరారు. ఇక మరియుపోల్‌లో ఆహారం, నీరు, విద్యుత్ లేని పరిస్థితుల్లో అత్యంత దారుణ పరిస్థితుల్లో అక్కడి అక్కడి బంకర్లలో ప్రజలు ఉన్నారు. వీటిల్లో నిద్రిస్తున్న సగం మందిని ఆదివారం ఖాళీ చేయవలసి ఉంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు సాగకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. "ఉక్రెయిన్ రెండు ప్రధాన నగరాల (కీవ్ మరియు ఖార్కివ్) నివాసితులను రష్యా మరియు బెలారస్‌లకు కారిడార్‌లలో పారిపోయేలా చేస్తుంది" అని రాయిటర్స్ పేర్కొంది.
ఇదిలావుండగా, ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింతగా పెంచింది. దీని కారణంగా ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇక అంతర్జాతీయ సమాజం రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు దాదాపు $285 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. అయితే, పాశ్చాత్య దేశాలు, అమెరికా, వారి మిత్రదేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా ఒత్తిడిలోకి జారుకుంటున్నది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గకుండా.. ఆంక్షలు అంటే.. యుద్ధంతో సమానమని హెచ్చరిస్తున్నది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధింపును ఖండిస్తూ.. ఆయా దేశాలకు కౌంటర్ ఇస్తూ.. రష్యా సైతం చర్యలు తీసుకుంటున్నది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులను నివేదిస్తున్న మీడియా సంస్థలను నియంత్రిస్తూ.. దేశంలో కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది రష్యా. ఈ చర్యలపై అంతర్జాతీయంగా మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.