
అమెరికా : americaలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. సోమవారం Iowa school బయటి నుంచి వెడుతున్న వాహనంలో నుంచి కాల్పులు జరగడంతో ఒకరు మరణించారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాపిటొల్ నుండి అర మైలు దూరంలో ఉన్న డెస్ మోయిన్స్ డౌన్‌టౌన్ సమీపంలోని ఈస్ట్ హై స్కూల్ మైదానంలో జరిగిన ఈ కాల్పుల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డెస్ మోయిన్స్ పోలీసులు ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. అయితే వీరిమీద ఇప్పటివరకు ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని తెలిపారు.
సార్జంట్ పాల్ పారిజెక్ KCCI-TVతో మాట్లాడుతూ, ఆ రోజు తరగతులు ముగియడానికి కొద్దిసేపటి ముందు, దాదాపు మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో విపరీతంగా కాల్స్ రావడం ప్రారంభించాయి. కాల్పుల మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున పాఠశాలను వెంటనే లాక్‌డౌన్ చేశారు. విద్యార్థులందనికీ లోపలే ఉంచేశారని ఒక వార్తా ప్రకటనలో అక్కడి అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటలకు లా ఎన్ ఫోర్స్ మెంట్ అంతా బాగానే ఉందని క్లియరెన్స్ ఇచ్చాక.. అప్పుడు వారిని బైటికి పంపించారు.
ఈ ఘటన మీద ఆ స్కూలు ప్రిన్సిపాల్ జిల్ వెర్‌స్టీగ్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. ఇది ఒక చెత్త పీడకల అంటూ అభివర్ణించారు. అంతేకాదు పిల్లలందరూ భయపడిపోయారు.. తల్లిదండ్రులు వారిని హత్తుకుని, ప్రేమగా వారిలోని భయాన్ని పోగొట్టాలని.. తల్లిదండ్రులను కోరారు. ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో జిల్లాలో మంగళవారం తరగతులు ఉండవని, యాక్ట్, పేరెంట్-టీచర్ సదస్సులను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గ్రేఫ్ కౌన్సెలర్లను కూడా అందుబాటులో ఉంచారు.
సూపరింటెండెంట్ థామస్ అహార్ట్ మాట్లాడుతూ పాఠశాలల్లో కాల్పులు "చాలా సాధారణం అయ్యాయి", "ఇలాంటి తుపాకీ చట్టాల్లో నిజమైన మార్పును తేవడం చాలా దూరంగా ఉన్న పని" అని అన్నారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడానికి "మా సిబ్బంది, విద్యార్థులు బలవంతంగా శిక్షణ పొందుతున్నారు. ఘటనలు పునరావృతమయితే ఎలా ఎదుర్కోవాలో కసరత్తులు జరుగుతున్నాయి. ఒక్కసారి ఇలాంటి సంఘటనలు ఎదురయితే ఆ గాయం చాలా సంవత్సరాలపాటు ఉంటుంది. మన రాష్ట్రం, మన దేశం ఆయుధాలు చాలా సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశాలుగా మారడం దురదృష్టకరం... అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కాల్పుల్లో బాధితులంతా టీనేజర్లేనని వారంతా విద్యార్థులేనో, కాదో తమకు తెలియదని పారిజెక్ చెప్పారు. ఈ ఘటన తరువాత వారి పేర్లు వెంటనే వెల్లడించలేదు. ఈ సంఘటన తరువాత ప్రజలకు కంటిన్యూ థ్రెట్ ఉంటుందని తాము నమ్మడం లేదని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల వెనకున్న ఉద్దేశ్యం ఏమిటో తెలియరాలేదు. అంతేకాదు అనుమానితుల గురించి ఏ వివరాలనూ పోలీసులు వెల్లడించలేదు. అయితే ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఘటనా స్థలం నుంచి షెల్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడానికి మాకున్న అన్ని అవకాశాలనూ ఉపయోగిస్తున్నాం. కాల్పులు జరిగిన స్కూల్ లోని విద్యార్థులే అత్యంత విలువైన ఆధారం అని మాకు తెలుసు." అన్నారు. డెస్ మోయిన్స్ పోలీస్ చీఫ్ డానా వింగెర్ట్ కాల్పులు జరిగిన తర్వాత పాఠశాలకు వెళ్లి ఈ హింసాత్మక ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
"దురదృష్టవశాత్తూ ఈరోజు ఇక్కడ జరిగిన ఘటన నిజానికి అర్థం లేనిది.. "ప్రజలు తమ మధ్య ఉణ్న విభేదాలను పరిష్కరించుకోవడానికి తుపాకీలను ఉపయోగిస్తున్నారు." ఇది చాలా విచారకరం అన్నారు.