Russia Ukraine Crisis: ఉక్రెయిన్ల‌ పోరాటం స్ఫూర్తిదాయకం: తైవాన్ విదేశాంగ మంత్రి

Published : Mar 08, 2022, 05:53 AM IST
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ల‌ పోరాటం స్ఫూర్తిదాయకం: తైవాన్ విదేశాంగ మంత్రి

సారాంశం

Russia Ukraine Crisis: రష్యన్ సైనికుల‌ను వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రేనియన్లు..  తైవాన్ ప్రజలకు స్ఫూర్తినిచ్చారని, ఉక్రెయిన్లు పోరాటం ప్ర‌పంచ దేశాల‌కు ప్రేర‌ణనిస్తుంద‌ని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు  అన్నారు. అలాగే.. ఆయ‌న‌ ఉక్రేనియన్ శరణార్థుల కోసం మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చ‌ర్య ప్రకటించి నేటికి 13 రోజులు. ర‌ష్యా చేస్తున్న సైనిక దాడిని వెంట‌నే ముగించాల‌ని  ప్రపంచ దేశాలు విజ్ఞప్తులు చేస్తున్నా,ఆంక్ష్లలు విధిస్తున్నా కూడా రష్యా మాత్రం వాటిని లెక్కచేయడం లేదు. ఉక్రెయిన్‌ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల్లో విద్వంసం సృష్టించింది. ఈ త‌రుణంలో రష్యన్ సైనికుల‌ను వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రేనియన్లు..  తైవాన్ ప్రజలకు స్ఫూర్తినిచ్చారని, ఉక్రెయిన్లు పోరాటం ప్ర‌పంచ దేశాల‌కు ప్రేర‌ణనిస్తుంద‌ని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు  అన్నారు. అలాగే.. ఆయ‌న‌ ఉక్రేనియన్ శరణార్థుల కోసం మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు.

ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ ప్రభుత్వం, ప్రజలు అగుంటిత ధైర్యం, దృఢ సంకల్పంతో పోరాడుతున్నారని మంత్రి జోసెఫ్ అన్నారు.  నిరంకుశ అధికారం నుండి బెదిరింపులు, బలవంతాన్ని ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ సైన్యం..  తైవాన్ ప్రజలకు ప్రేరణగా నిలిచార‌ని అన్నారు. ప్రజాస్వామ్య, స్వయం-పాలిత తైవాన్‌ను చైనా క్లెయిమ్ చేస్తోంది, అవసరమైతే బలవంతంగా ద్వీపాన్ని తిరిగి తన ఆధీనంలోకి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేసింది.

ఉక్రెయిన్ దుస్థితి.. తైవాన్ కూడా ఎదుర్కొనున్న‌ద‌నీ, త్వ‌ర‌లో చైనా తైవాన్ పై దండ‌యాత్ర చేసే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌పంచ దేశాలు భావించాయి. కానీ చైనా మాత్రం అంత‌కు మించి అన్న‌ట్టు... తైవాన్ ఎల్లప్పుడూ చైనాలో భాగమేనని.. తైవాన్ ను ఉక్రెయిన్ తో పోల్చడాన్ని చైనా తిరస్కరించింది.

తైవాన్ ద్వీపం యొక్క పరిస్థితి ప్రాథమికంగా భిన్నంగా ఉందని, తైవాన్ జలసంధి  చైనా నుండి వేరు చేస్తుంది. ఇది స‌హ‌జ అవ‌రోధం..  ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి తైవాన్ తన హెచ్చరిక స్థాయిని పెంచింది. అయితే చైనా చేత అసాధారణమైన సైనిక కదలికలను నివేదించలేదు. ఈ క్ర‌మంలో చైనా ప‌రోక్షంగా ర‌ష్యాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే.. తైవాన్ ప్రజలు ఉక్రెయిన్  పట్ల సానుభూతితో ఉన్నారని  చెప్పారు. ఇదిలాఉంటే.. ఉక్రేనియన్‌లకు తైవాన్ ఆర్థిక సాయం చేసింది. NT$300 మిలియన్ ($10.6 మిలియన్లు) ఆర్థిక సాయాన్ని అందించింది. పోలాండ్‌లోని తైవాన్ ప్రతినిధి కార్యాలయం సోమవారం శరణార్థి ఏజెన్సీకి NT$100 మిలియన్ల తొలి విడ‌త సాయంగా అందించింది

తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్, వైస్ ప్రెసిడెంట్ విలియం లాయ్, ప్రీమియర్ సు త్సెంగ్-చాంగ్ వారి ఒక నెల జీతాన్ని స‌హాయంగా ప్ర‌క‌టించారు. అలాగే.. పోలాండ్ ఉన్న ఉక్రెయిన్ కు ఆర్థిక స‌హాయం అంద‌జేసింది. శరణార్థుల కోసం ఇటీవల పోలాండ్‌కు 27 టన్నుల వైద్య సామాగ్రిని రవాణా చేయడంతో తైవాన్ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు ఉక్రెయిన్ అధికారులు. ఇదే త‌రుణంలో తైవాన్ కూడా రష్యాపై వాణిజ్య ప‌ర‌మైన ఆంక్ష‌లు విధించింది.   

అలాగే.. చైనా విదేశాంగ మంత్రి, వాంగ్ యి ఉక్రెయిన్‌కు  సాధ్యమైనంత త్వరగా సహాయం అందిస్తామ‌ని తెలిపారు.  చైనా ఇలాంటి సాయం ప్రకటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని "దండయాత్ర" అని పిలవడానికి చైనా నిరాకరించింది, అయితే రష్యా యొక్క "చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను" గౌరవించాలని పాశ్చాత్య దేశాలను కోరింది. చర్చల ద్వారానే సంక్షోభానికి పరిష్కారం ల‌భిస్తుంద‌ని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి