
Russia Ukraine crisis: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రష్యా యుద్ద విమానాలు ఉక్రెయిన్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ దేశాలపై పరోక్షంగా ప్రభావం చూపనున్నది. ప్రధానంగా ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో సామాన్యులపై మరింత భారంపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ తరుణంలో భారత్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ యుద్దంలో భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయయడం. ఈ తరుణంలో ఉక్రెయిన్ భారత్ జోక్యం చేసుకోవాలని కోరడం, మరోవైపు భారత్ కు మిత్ర కూటమి ( నాటో దేశాలు) అమెరికా, బ్రిటన్ లకు రష్యా వ్యతిరేకంగా యుద్ధం చేయడం వంటి పరిణామాలు బారత్‌ను కలవరపెడుతున్నాయి.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునప్రతిష్టించాలనే డిమాండ్ల నేపథ్యంలో భారత్ తటస్థంగా ఉంటామని కేంద్రమంత్రి రంజిత్ సింగ్ ప్రకటించారు. దీంతో రష్యా-ఉక్రెయిన్ పోరుపై అనుసరించాల్సిన వైఖరిపై ప్రధాని మోడీ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, ఇతర మంత్రులు, నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను, మరీ ముఖ్యంగా విద్యార్థులకు, సాయపడేందుకుగల మార్గాలను భారత ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ సంఘర్షణ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో వేగంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌లో అత్యంత వేగంగా మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు ధరలు కూడా తీవ్రంగా పెరిగాయి.
అంతకుముందు.. యుద్ద సంక్షోభ పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కోరారు. భారత ప్రధాని మోడీ చెబితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా వినే అవకాశాలున్నాయని భావిస్తున్నట్టు తెలిపారు. రష్యాతో భారతదేశానికి ప్రత్యేక సంబంధాలు ఉన్నాయనీ, పరిస్థితిని నియంత్రించడంలో ప్రధానిమోడీ మరింత చురుకైన పాత్ర పోషించగలరని, మోదీ వెంటనే స్పందించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడాలని పొలిఖా విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలోనే మోదీ అత్యంత శక్తిమంతమైన నాయకుడు అని, ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని వివరించారు. భారతీయుల నుండి మరింత అనుకూలమైన వైఖరిని ఆశిస్తున్నామని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు మా అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని తక్షణమే సంప్రదించాలని మేము ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నాము అని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా అన్నారు.