
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు దళాలను అప్రమత్తం చేయడం ద్వారా ఉద్రిక్తతలను మరింత పెంచిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితులపై ఉక్రెయిన్ స్పందిస్తూ.. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి తమ సైనిక బలగాలు రష్యాకు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో తమపై కొనసాగుతున్న రష్యన్ సైబర్ దాడికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఆ దేశంపై సైబర్సై వార్ కు సిద్ధమవుతున్నదని ఉక్రెయిన్ సంకేతాలు పంపుతోంది. దీనికోసం ఐటీ ఆర్మీని సైతం ఏర్పాటు చేసి పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నదని తెలుస్తోంది.
వివరాల్లోకెళ్తే.. మిలిటరీ దాడులతో పాటు రష్యన్ సైబర్ దాడులను ఉక్రెయిన్ ఎదుర్కొంటున్నది. ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తనకు ఉన్న అన్ని అవకాశాలపై ఉక్రెయిన్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే రష్యా సైబర్ దాడులను ఎదుర్కొవడంతో పాటు వారిని కౌంటర్ అటాక్ చేసే విధంగా ఉక్రెయిన్ ఐటీ ఆర్మీని సమీకరిస్తోంది. దీనిలో భాగంగా గెలిగ్రామ్ లో ఐటీ ఆర్మీ గ్రూప్ ను ప్రారంభించింది. ఐటీ నిపుణులను, టెక్ నిపుణుల సేవలను ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తోంది. ఈ టెలీగ్రామ్ గ్రూప్ దాదాపు 2 లక్షల మంది వినియోగదారులకు చేరుకుంది.
'ఐటి ఆర్మీ ఆఫ్ ఉక్రెయిన్' అని పిలవబడే ఈ టెలిగ్రామ్ ఖాతాను ఉపయోగించి రష్యా సైబర్ దాడులతో పోరాడటానికి మరియు రష్యన్ సైట్‌లు, ఏజెంట్లనుపై సైబర్ దాడులు చేస్తూ.. దేశానికి సహాయం చేయడానికి సాంకేతిక నిపుణులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే "రష్యా ప్రధాన బ్యాంకులలో ఒకటైన స్బేర్‌బ్యాంక్ కోసం APIని మూసివేయమని ఛానెల్‌లో పిలుపునిచ్చింది, సైట్ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో ఉంది అని TechCrunch నివేదించింది. ఉక్రేనియన్ ప్రభుత్వ అధికారులు టెలిగ్రామ్ లింక్‌ను ట్వీట్ చేస్తూ ఐటీ ఆర్మీ'ని కూడా సమర్థిస్తున్నారు.
‘‘మేం ఐటీ ఆర్మీని రూపొందిస్తున్నాం. డిజిటల్ టాలెంట్స్ కావాలి. అందరికీ పనులు ఉంటాయి. మేము సైబర్ ఫ్రంట్‌లో పోరాడుతూనే ఉన్నాము. సైబర్ స్పెషలిస్ట్‌ల కోసం ఛానెల్‌లో మొదటి పని కొనసాగుతోంది” అని ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రి మైఖైలో ఫెడోరోవ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మిటిటరీ దాడులతో పాటు రష్యా - ఉక్రెయిన్ మధ్య సైబర్ యుద్ధం తీవ్రమైంది, రష్యా కొత్త విధ్వంసక మాల్వేర్‌ను ఉపయోగించి ఉక్రేనియన్ సంస్థలకు చెందిన సిస్టమ్‌లపై డేటాను శాశ్వతంగా నాశనం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల హ్యాకింగ్ గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నాయి. రష్యా-మద్దతుగల హ్యాకర్లు ఇప్పటికే అనేక ఉక్రేనియన్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, బ్యాంకులపై దాడులు సాగిస్తున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ మద్దతు గ్రూపులు రష్యాపై సైబర్ దాడులకు సిద్ధమవుతున్నాయి. ఇదిలావుండగా, అంతర్జాతీయంగా అన్ని దేశాలు రష్యా తీరును తప్పుబడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చి.. యుద్దానికి ముగింపు పలికే విధంగా వరుస సమావేశాలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటోంది.