NATO chief: ర‌ష్యాను ఉక్రెయిన్ ఓడించ‌గ‌ల‌దు: నాటో చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Rajesh KFirst Published May 16, 2022, 7:01 AM IST
Highlights

NATO chief: ఉక్రెయిన్- రష్యా మ‌ధ్య జ‌రుగుతున్న‌ యుద్ధంలో రష్యా ను ఉక్రెయిన్ ఓడిపోవచ్చని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. ఉక్రేనియన్లు ధైర్యంగా తమ దేశాన్ని రక్షించుకుంటుంద‌నీ, త‌మ మ‌ద్ద‌తు ఉక్రెయిన్‌కు కొనసాగించనున్న‌ట్టు పేర్కొన్నారు. 
 

NATO chief:  రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించగలదని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించడంలో రష్యా విఫలమైందని కూడా ఆయన పేర్కొన్నారు. బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని పంపాలని నాటో దేశాలకు పిలుపునిచ్చారు.
 
ఉక్రేనియన్లు ధైర్యంగా తమ దేశాన్ని రక్షించుకుంటున్నారనీ, తాము ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాల‌ని  భావిస్తున్న‌ట్టు స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించడంలో రష్యా సాధించినంత లాభం వారికి లభించలేదనీ, ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైంది. రష్యన్ దళాలు ఖార్కివ్ నుండి ఉపసంహరించుకున్నాయని తెలిపారు. 

యుద్దం ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందించేందుకు నాటో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. జర్మనీ విదేశాంగ మంత్రి అనలేనా బేయర్‌బాక్ ఉక్రెయిన్‌కు సైనిక సహాయం కోసం మళ్లీ పిలుపునిచ్చారు. "ఉక్రెయిన్ ఆత్మరక్షణ కోసం మద్దతు అవసరమైనంత కాలం, మేము ఉక్రెయిన్‌కు సహాయం చేస్తాం" అని బరేబాక్ అన్నారు.

స్టోల్టెన్‌బర్గ్ ప్రకారం, ఫిన్లాండ్ NATOలో చేరడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఫిన్లాండ్ సభ్యత్వం మాకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఇది NATO యొక్క తలుపులు అందరికీ తెరిచి ఉన్నాయి అనే సందేశాన్ని కూడా పంపుతుంది.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించినప్పటి నుండి ఫిన్లాండ్, స్వీడన్ NATO సభ్యత్వం కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఫిన్‌లాండ్ మరియు స్వీడన్‌లలో నాటో సభ్యత్వానికి అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ తెలిపారు.

 బెర్లిన్‌లో సంకీర్ణ విదేశాంగ మంత్రులు సమావేశమైన తర్వాత స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ, “సభ్యత్వాన్ని నిలిపివేసే ఉద్దేశం లేదని టర్కీ స్పష్టం చేసింది.సభ్యత్వ సమస్యలపై ఎలా కొనసాగాలనే దానిపై తాము  ఏకాభిప్రాయాన్ని సాధించగలమని, తాము విశ్వసిస్తున్నామ‌ని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావూసోగ్లు చెప్పారు. 

ఫిన్లాండ్, స్వీడన్ NATOలో చేరడాన్ని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వ్యతిరేకిస్తున్నారు. ఫిన్లాండ్,  స్వీడన్ నాటోలో చేరాలనే ఆలోచనకు టర్కీ మద్దతు ఇవ్వదని ఎర్డోన్ చెప్పారు. ఎర్డోన్ ప్రకారం, ఈ నార్డిక్ దేశాలు కుర్దిష్ యోధులకు మద్దతు ఇస్తున్నాయి.  వీరిని టర్కీ ఉగ్రవాదులుగా పరిగణిస్తుంది.

click me!