Miracle: 40 నిమిషాలు మరణించి లేచింది.. చావు అనుభవాలను ఇలా చెప్పింది..!

By Mahesh K  |  First Published Dec 29, 2023, 4:10 PM IST

ఆమె 40 నిమిషాలపాటు మరణించింది. యూకేకు చెందిన క్రిస్టీ బార్టొఫాట్ మెలకువకు వచ్చిన తర్వాత విచిత్ర వివరాలు వెల్లడించింది. ఆమె చావు అనుభవాలు ఇప్పుడు సంచలనం అయ్యాయి.
 


Mystery: ఆమె 40 నిమిషాలపాటు మరణించింది. జీవం లేని శరీరాన్ని ఆమె భర్త హాస్పిటల్ తీసుకెళ్లాడు. వైద్యులు కూడా దాదాపు ఆమె జీవించడం కష్టమే అని తేల్చారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచనలు చేశారు. కానీ, 40 నిమిషాల తర్వాత ఆమె మేలుకుంది. దీంతో అందరూ అవాక్కయ్యారు. యూకేకు చెందిన ఆమె ఆ 40 నిమిషాలు చూసిన విచిత్ర పరిస్థితులను ఏకరువు పెట్టడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

క్రిస్టీ బార్టొఫాట్ తన భాగస్వామి స్టూతో ఓ లగ్జరీ నైట్‌కు ప్లాన్ చేసింది. కానీ, కొన్ని గంటల తర్వాత క్రిస్టీ సోఫాలో నిర్జీవంగా పడి ఉన్నది. ఆమె భర్త వెంటనే భార్యను హాస్పిటల్ తరలించాడు. నార్త్ యార్క్‌షైర్‌లోని స్కార్బరోకు చెందిన ఆమె మెడికల్ సవాళ్లను అధిగమించి అన్ని, అవాంతరాలు ఎదుర్కొని, రికవరీ అయ్యే అవకాశాలు అత్యల్పంగా ఉన్నప్పటికీ ఆమె సజీవంగా బయటపడింది. కార్డియక్ అరెస్టు వంటి సీరియస్ సమస్యలకు ఆమె లోనైది.  వైద్యులు కూడా ఆమెను మందులతో కోమాలోకి పంపారు. కానీ, ఆమె ఈ సవాళ్లను ఎదుర్కొని జీవితాన్ని జయించింది.

Latest Videos

undefined

‘తొలి రోజు రాత్రి చాలా కీలకమైనది, ఆ రోజూ అంతా గందరగోళంగా ఉన్నది. నేను మళ్లీ జీవించే అవకాశాలు లేవని స్టూకు చెప్పారు. నేను లేని జీవితాన్ని ఎదుర్కోవడానికి రెడీ కావాలని అన్నారు. కానీ, స్టూ అందుకు సిద్ధపడలేదు’ అని క్రిస్టీ తెలిపారు.

Also Read: Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ.. కూటమి పరిస్థితి ఏమిటీ?

‘ఆ సమయంలో ఇక్కడ ఏం జరుగుతున్నదో నా కుటుంబానికి తప్పితే మరెవరికీ తెలియదు. కానీ, నా ఆత్మ నా సోదరితో టచ్‌లోకి వెళ్లింది. అసలు ఏం జరుగుతున్నదని ఆమె అడిగింది. నా ఆత్మ సోదరి ఫ్రంట్ రూమ్‌లో ఉన్నదని, పిల్లలు, తండ్రి కోసం అవసరమైన లిస్టులను రాయాలని అడిగింది. నా బాడీ పాడైపోతున్నదని, నేను మళ్లీ వెనక్కి రాగలననే నమ్మకాలు సడలిపోతున్నాయని నేను నా ఆత్మతో చెప్పాను. కానీ, నా ఆత్మ మాత్రం నాతో పరుషంగా వ్యవహరించింది. నన్ను వెంటనే బాడీలోకి వెళ్లాని ఫైర్ అయింది.

‘ఆ తర్వాత అద్భుత ఘటన జరిగింది. నేను కోమా నుంచి లేచాను. వెంటనే నా భర్త స్టూ గురించి అడిగాను’  అని చెప్పింది. ‘నా గుండె, ఊపిరితిత్తుల సరిగానే పని చేస్తున్నాయి. నిజానికి ఇదంతా వారు ఊహించలేదు. కానీ, వారు ఊహలకు అందకుండా తన ఆరోగ్యం మెరుగైంది’ అని క్రిస్టీ చెప్పింది.

‘నేను చివరి విషయంగా చెప్పేదేమిటంటే.. నేను నా దేహంలోకి రావాలనుకున్నప్పుడు నాకు అవసరమైన ముఖ్య విషయాలు ఏమిటీ? నా సమస్యల సమాచారాన్ని  డౌన్‌లెడ్ చేసుకోవడం. నేను ఇప్పుడే చావడం లేదని, నేను వచ్చిన మిషన్ పూర్తి కాలేదని తెలుసుకున్నాను’ అని క్రిస్టీ వివరించారు.  ‘నా శ్వాస కోశాలు బాగయ్యాయి. ఇదెలా సాధ్యమని వైద్యులు నన్ను అడిగారు. నేను నా స్టోరీని చెప్పాను. నేను రికవరీ కావడం సంతోషంగా ఉన్నది’ అని చెప్పారు.

click me!