పది గంటలపాటు సముద్రంలోనే ఆ యువతి, చివరికిలా...

By narsimha lodeFirst Published 20, Aug 2018, 3:58 PM IST
Highlights

ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన ఓ యువతి ప్రాణాలతో  బతికి బయటపడింది. పది గంటల పాటు ఆ యువతి ప్రాణాలను కాపాడుకొంది. అయితే ఆ యువతిని నేవీ అధికారులు ఆమెను కాపాడారు.

లండన్: ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన ఓ యువతి ప్రాణాలతో  బతికి బయటపడింది. పది గంటల పాటు ఆ యువతి ప్రాణాలను కాపాడుకొంది. అయితే ఆ యువతిని నేవీ అధికారులు ఆమెను కాపాడారు.

బ్రిటన్‌కు చెందిన కే అనే యువతి క్రోయేషియాకు చెందిన నార్వేజియన్ స్టార్ ఓడలో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తోంది.  పడవ అంచున నిలబడి స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ఆ యువతి కాలుజారి సముద్రంలో పడిపోయింది.

ఆ యువతి పడిపోయిన ప్రదేశం క్రొయేషియా తీర ప్రాంతానికి 60 మైళ్ల దూరంలో ఉంది. ఈ విషయాన్ని బాధితురాలి స్నేహితులు ఓడ కెప్టెన్‌కు సమాచారాన్ని ఇచ్చారు. ఓడ కెప్టెన్ నేవీ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. 

గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ  తీర ప్రాంత అధికారులు విమానంతో గాలించారు. పది గంటల పాటు సముద్రంలో ఎలా ఉందో కే మాత్రం సరిగా వివరించలేకపోయింది.  పది గంటల పాటు కే  సముద్రంలో ఉండి కూడ ప్రాణాలతో బయటపడడాన్ని సాధారణ విషయంగా పరిగణించడం లేదు.

 

 

Last Updated 9, Sep 2018, 12:52 PM IST