డెలీవరీ కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లిన మంత్రి

By narsimha lodeFirst Published 20, Aug 2018, 1:29 PM IST
Highlights

నెలలు నిండిన గర్భిణీ  ప్రసవం కోసం  సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లింది. ఆమె సాధారణ మహిళే కాదు... న్యూజిలాండ్ దేశానికి మహిళా సంక్షేమ శాఖ మంత్రి  ప్రసవం కోసం సైకిల్ తొక్కుకొంటూ ఆసుపత్రికి వెళ్లింది.

వెల్లింగ్టన్: నెలలు నిండిన గర్భిణీ  ప్రసవం కోసం  సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లింది. ఆమె సాధారణ మహిళే కాదు... న్యూజిలాండ్ దేశానికి మహిళా సంక్షేమ శాఖ మంత్రి  ప్రసవం కోసం సైకిల్ తొక్కుకొంటూ ఆసుపత్రికి వెళ్లింది. 

నెలలు నిండిన గర్భిణి సాధారణంగా ఇంట్లో అటూ ఇటూ నడవడానికే ఇబ్బందిపడతారు. న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా సంక్షేమ శాఖ మంత్రి గా పనిచేస్తున్న  జూలీ అన్నే గెంటర్ మాత్రం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లారు.

ఆమె 42 వారాల గర్భిణి.  ప్రసవ సమయం దగ్గర పడడంతో  జూలీ ఆదివారం నాడు సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లింది.  తన ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న  ఆసుపత్రికి  సైకిల్‌పై భర్తతో కలిసి వచ్చింది.  

భర్తతో సైకిల్‌పై వచ్చిన జూలీ  ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడ ఇటీవలనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Last Updated 9, Sep 2018, 12:57 PM IST