కేరళకు రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన ఖతార్ రాజు

By Arun Kumar PFirst Published Aug 20, 2018, 3:34 PM IST
Highlights

దైవభూమిగా పిలుచుకునే కేరళ రాష్ట్రంపై వరున దేవుడు కన్నెర్రజేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. వరద నీటిలో నివాసాలు మునిగిపోయి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీంతో వరద బాధితులను ఆదుకోడానికి దేశ ప్రజలంతా ఏకమై విరాళాల రూపంలో, వస్తువుల రూపంలో సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వరదలు విదేశీయులను కూడా కలచివేశాయి. దీంతో గల్ఫ్ దేశమైన ఖతార్ కేరళకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది. 

ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీ కేరళకు తక్షణ సాయంగా 5 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.35 కోట్లు) విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఖతార్ చారిటీ నుండి అందించనున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ విషయాన్ని ఖతార్ ప్రధాన మంత్రి అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ తానీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేరళ వనద బాధితులను ఆదుకునేందుకు ఖతార్ రాజు అనుమతించారని ఆయన ట్వీట్ చేశారు. తమ దేశ అభివృద్ది కోసం పాలుపంచుకుంటున్న భారత దేశస్థులు ఆపదలో వున్న సమయంలో సాయం చేయడానికి తాము ముందుంటామని తెలిపారు. ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ గడ్డు పరిస్థితుల నుండి కేరళ త్వరగా బైటపడాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయుల్లో ఎక్కువమంది కేరళకు చెందిన వారే. వారు వివిధ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ అభివృద్దిలో పాలుపంచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు భారతీయులతో పాటు గల్ఫ్ దేశాధినేతలు కూడా కేరళలోని పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు.  ఇందులో భాగంగా ఖతార్ రాజు కూడా స్పందించి కేరళ కు సాయం చేయడంతో పాటు దేశ ప్రజలు కూడా తమకు తోచిన సాయం చేయాల్సిందిగా కోరారు.  
 
click me!