ఆఫ్ఘనిస్తాన్: ఇక ఉపేక్షించేది లేదు.. ‘‘పంజ్ షీర్‌’’పై యుద్ధానికి తాలిబన్లు రెడీ, సరిహద్దుల్లోకి బలగాలు

By Siva KodatiFirst Published Aug 25, 2021, 3:39 PM IST
Highlights

పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు వ్యూహం రచించారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న సేనలకు తోడు అదనపు బలగాలను భారీగా తరలిస్తోంది తాలిబన్. ముఖ్యంగా ఇటీవల తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న మూడు జిల్లాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు తాలిబన్లు. 
 

కంటిగా నలుసుగా మారిన పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ను స్వాధీనం చేసుకునే పనిలో పడింది  తాలిబన్ సైన్యం. పంజ్ షీర్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి ముట్టడించాయి తాలిబన్ సేనలు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న సేనలకు తోడు అదనపు బలగాలను భారీగా తరలిస్తోంది తాలిబన్. ముఖ్యంగా ఇటీవల తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న మూడు జిల్లాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు తాలిబన్లు. 

పంజ్ షీర్ ప్రావిన్స్ పూర్తిగా ఎత్తయిన పర్వత ప్రాంతాలతో నిండి వుంటుంది. ఆ ప్రాంతంపై ఇంత వరకు తాలిబన్లు పట్టు సాధించలేకపోయారు. తాలిబన్లే కాదు అంతకుముందు రష్యా కూడా పంజ్ షీర్ లొంగలేదు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పంజ్ షీర్ ప్రావిన్స్‌పై పట్టు సాధించాలని తాలిబన్లు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో మెరుపు దాడుల్లో దిట్టలైన దళాలను సిద్ధం చేసింది. భారీగా ఆయుధాలు, ఆర్మ్‌డ్ వాహనాలో పంజ్ షీర్ దిశగా బయల్దేరాయి  తాలిబన్ సేనలు. 

ALso Read:తిరుగుబాటుదారులతో తాలిబాన్ల శాంతి చర్చ.. పంజ్‌షిర్‌కు 40 మంది ప్రతినిధులు

ఆరంభంలో అహ్మద్ మసూద్‌ను తక్కువగా అంచనా వేశారు తాలిబన్లు. తండ్రి స్థాయిలో అతని నుంచి ప్రతిఘటన వస్తుందని ఊహించలేకపోయారు. కానీ తాను తండ్రికి తక్కువ కాదన్నట్లు తాలిబన్లను ప్రతిఘటిస్తున్నాడు అహ్మద్ మసూద్. కన్నతల్లి లాంటి మాతృభూమి కోసం ప్రాణ త్యాగమైనా చేస్తాం గానీ శత్రువుకి లొంగిపోయేది లేదంటూ స్పష్టం చేశారు. మరోవైపు  పంజ్ షీర్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో బలగాల సన్నద్ధతను సమీక్షిస్తున్నారు అహ్మద్ మసూద్. 

click me!