మరో కొత్త వ్యాధి కలకలం: యూకేలో రెండు మంకీపాక్స్ కేసులు

By narsimha lodeFirst Published Jun 15, 2021, 11:28 AM IST
Highlights

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం భయంతో అల్లాడుతున్న సమయంలో మరో  కొత్త రకం వ్యాధి మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలోని నార్త్‌వేల్స్ లో రెండు మంకీ‌పాక్స్ కేసులు నమోదయ్యాయి. 

లండన్:కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం భయంతో అల్లాడుతున్న సమయంలో మరో  కొత్త రకం వ్యాధి మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలోని నార్త్‌వేల్స్ లో రెండు మంకీ‌పాక్స్ కేసులు నమోదయ్యాయి. 

ఒకే కుటుంబంలోని ఇద్దరికి మంకీఫాక్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  ఈ ఇద్దరికి వ్యాధి సోకి 21 రోజులైంది. అయితే 21 రోజులుగా వీరు ఎవరెవరని కలిశారనే దానిపై  అధికారులు  ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరూ కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మంకీపాక్స్... జూనోటికి వైరల్ వ్యాధి.  మధ్య ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలోని అడవుల్లో ఉండే ప్రజలకు ఎక్కువగా సోకుతుంది. ఁఈ వైరస్ సోకిన జంతువు రక్తం ,చెమట లేదా లాలాజలం నుండి మంకీపాక్స్ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గిన తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 
 

click me!