భార్యతో విడాకులు.. కోపం తీరలేదని కన్నబిడ్డలను..

Published : Jun 15, 2021, 08:01 AM IST
భార్యతో విడాకులు.. కోపం తీరలేదని కన్నబిడ్డలను..

సారాంశం

అనుకోకుండా ఒకరోజు చిన్నారులు ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో కంగారుపడిన జిమ్మర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఓ వ్యక్తి భార్య మీద కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. తనతో గొడవ పడి విడిపోయిందనే కారణంతో మాజీ భార్యపై పగ పెంచుకున్నాడు. ఆ పగ తీర్చుకోవడానికి ఏకంగా తన కన్నబిడ్డలనే చంపేశాడు.  ఈ దారుణ సంఘటన స్పెయిన్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... స్పెయిన్ లోని టెనెరిఫేకు చెందిన జిమ్మర్ మ్యాన్ భర్త థామస్ జమినోతో విడాకులు  తీసుకుంది. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలు ఆనా, ఒలీవియాతో కలిసి జీవిస్తోంది.

అనుకోకుండా ఒకరోజు చిన్నారులు ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో కంగారుపడిన జిమ్మర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంత వెతికినా చిన్నారుల ఆచూకీ మాత్రం లభించలేదు. కాగా.. ఇటీవల సముద్రంలో 3000 అడుగుల లోతులో.. స్పోర్ట్స్‌ బ్యాగులో ఒలీవియా మృతదేహం లభ్యమైంది. 

ఆనా ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ చిన్నారి కూడా చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆనా, ఒలీవియాల మరణానికి కారణం పిల్లల తండ్రి జెమినోనే అని తేలింది. మాజీ భార్యకు అంతు లేని దుఖాన్ని మిగల్చటానికి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?