నీరవ్ మోడీ భారత్‌కు అప్పగింత: యూకే హోంమంత్రి ఆదేశాలు

By Siva KodatiFirst Published Apr 16, 2021, 5:58 PM IST
Highlights

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ఆర్ధిక నేరగాడు నీరవ్‌మోడీని భారత్‌కు అప్పగించేందుకు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి బ్రిటన్ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ఆర్ధిక నేరగాడు నీరవ్‌మోడీని భారత్‌కు అప్పగించేందుకు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి బ్రిటన్ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

కాగా, నీరవ్ మోడీ కేసుకు సంబంధించి ఫిబ్రవరిలో భారత్‌ ఘనవిజయం సాధించింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో లండన్‌‌కు పారిపోయిన నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అనుమతి ఇచ్చింది.

భారత వాదనలతో ఏకీభవించిన యూకే కోర్టు నీరవ్‌పై అభియోగాలు రుజువయ్యాయని తుది తీర్పు చెప్పింది. భారత ఈడీ అధికారులు సమర్పించిన ఆధారాలతో బ్రిటన్ కోర్టు సంతృప్తి చెందింది.

అంతేకాదు, నీరవ్ మోడీ సాక్ష్యాలను నాశనం చేశారని యూకే కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనలను సైతం బ్రిటన్ కోర్టు కొట్టివేసింది. మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు రుజువు కావడంతో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

click me!