క్యాబేజీ కోసి ప్యాక్ చేస్తే.. రూ.63లక్షల జీతం.. ఎక్కడో తెలుసా?

By telugu news teamFirst Published Oct 2, 2021, 4:58 PM IST
Highlights

యూకేలోకి ఓ కంపెనీ మాత్రం భారీ జీతం ఇచ్చి మరీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.లక్షల్లో జీతం ఇస్తామంటూ ప్రకటించింది. అదేమీ ఐటీ కంపెనీ కాకపోవడం గమనార్హం.


కరోనా మహమ్మారి కారణంగా  చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఎంతో మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. కొందరికేమో.. ఉద్యోగాల్లో కోత పడింది. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ యూకేలోకి ఓ కంపెనీ మాత్రం భారీ జీతం ఇచ్చి మరీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.లక్షల్లో జీతం ఇస్తామంటూ ప్రకటించింది. అదేమీ ఐటీ కంపెనీ కాకపోవడం గమనార్హం. అదొక ఫార్మింగ్ కంపెనీ. నమ్మకస్యంగా లేకపోయినా ఇదే  నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రిటన్‌కు చెందిన ఫార్మింగ్ కంపెనీ టిహెచ్ క్లెమెంట్స్ & సన్ లిమిటెడ్ తాజాగా ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పొలంలో పండించిన క్యాబేజీలను తెంపి, ప్యాకింగ్ చేసేందుకు ఉద్యోగులు కావాల్సిందిగా అందులో పేర్కొంది. ఈ రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఏడాదికి 62,400 పౌండ్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.63లక్షల 20వేలు) జీతం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా.. టిహెచ్ క్లెమెంట్స్ & సన్ లిమిటెడ్ చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ విషయం హాట్ టాపిక్ అవ్వడంతో.. స్పందిస్తున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 
 

click me!